logo

రూ. 7కోట్ల బిల్లుల పెండింగ్‌

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు భోజనం పంపిణీకి సంబంధించి గుత్తేదారుకు బిల్లులు బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. ఇప్పటికే చాలా జిల్లాల్లో సరఫరా నిలిపేశారు. బిల్లులు ఇవ్వకపోతే ఇక్కడ కూడా ఆ పరిస్థితి తప్పదని

Published : 08 Dec 2021 05:13 IST

రోగులకు భోజన సరఫరాపై ప్రభావం


సాధారణ రోగులకు భోజనం పంపిణీ చేస్తున్న దృశ్యం

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు భోజనం పంపిణీకి సంబంధించి గుత్తేదారుకు బిల్లులు బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. ఇప్పటికే చాలా జిల్లాల్లో సరఫరా నిలిపేశారు. బిల్లులు ఇవ్వకపోతే ఇక్కడ కూడా ఆ పరిస్థితి తప్పదని గుత్తేదారు పేర్కొంటున్నారు. ఆస్పత్రి వార్డుల్లో ఉన్న రోగులకు ప్రతి రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పూట భోజనం, సాయంత్రం వేళ అల్పాహారం అందజేస్తారు. జనరల్‌ డైట్‌ రోగికి రూ.36, ఇతర రోగులకు పరిస్థితిని బట్టి రూ.100, కొవిడ్‌ రోగికి రూ.500 వరకు ప్రభుత్వం గుత్తేదారులకు అందజేస్తుంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకు భోజనం సరఫరా చేసే గుత్తేదారుకు దాదాపు రూ.7 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఈయనకు రూ.3కోట్ల బకాయిలకు టోకేన్‌ నెంబర్‌ కేటాయించినా ట్రెజరీ నుంచి ఖాతాకు నగదు జమ కాలేదు. జనరల్‌ డైట్‌ నగదుకు సంబంధించి రూ.30 లక్షలు ట్రెజరీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో గుత్తేదారులంతా రోగులకు భోజన సరఫరా నిలిపివేశారు. బకాయిలు చెల్లించకపోలే తానూ అదే బాట పట్టకతప్పదని స్థానిక గుత్తేదారు పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనని, పరిస్థితిని ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు వివరించామన్నారు. గుత్తేదారు సహకారంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు భోజనం సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని