logo
Published : 08/12/2021 05:58 IST

పోరాటాలతోనే హక్కులు సాధించుకుంటాం


కలెక్టరేట్‌లో నిరసన తెలుపుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు రావాల్సిన హక్కులు సాధించుకునే వరకు పోరాడతామని ఏపీ జేఏసీ జిల్లా ఛైర్మన్‌ ఘంటసాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కలెక్టరేట్‌లో ఉద్యోగ సంఘాలన్నీ కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని, ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని వాగ్దానాలిచ్చి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగుల న్యాయమైన 71 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 11వ పీఆర్‌సీ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ తదితరాల్లోని రూ.రెండు వేల కోట్లను కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తత్సారం చేస్తుందన్నారు. 9వ తేదీ వరకు వరుసగా నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని, 10న భోజన విరామ సమయంలో ఉద్యోగులంతా కలిసి నిరసన చేపట్టనున్నామన్నారు. అప్పటికీ స్పందించకపోతే పెద్ద పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ కనపర్తి సంగీతరావు మాట్లాడుతూ తాము ప్రభుత్వాన్ని బెదిరించడం లేదని, హక్కుల సాధనకు మాత్రమే నిరసన తెలుపుతున్నామన్నారు. పది రోజుల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పీఆర్‌సీ ఇస్తామంటున్నారని, ఇస్తే సంతోషమేనన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఎంత వరకైనా ఉద్యమాన్ని తీసుకెళ్తామన్నారు. నిరసన కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు కె.శ్రీనివాసశర్మ, సుకుమార్‌, ఎం.ఎన్‌.మూర్తి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, పెన్షనర్ల సంఘం నాయకులు నాగరాజు, పలువురు పెన్షనర్లు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని