logo

పంట నమోదులో అక్రమాలపై విచారణ జరిపించండి

తప్పుడు సర్వే నంబర్లతో ఈ రాష్ట్రంలో లేని వారు ఇక్కడ భూములు సాగు చేస్తున్నట్లు అధికారులు నమోదు చేశారని, విచారణ జరిపించాలని సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధిమీనాను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కోరారు.

Published : 08 Dec 2021 05:58 IST


సబ్‌ కలెక్టర్‌కు వివరాలు తెలియజేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: తప్పుడు సర్వే నంబర్లతో ఈ రాష్ట్రంలో లేని వారు ఇక్కడ భూములు సాగు చేస్తున్నట్లు అధికారులు నమోదు చేశారని, విచారణ జరిపించాలని సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధిమీనాను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కోరారు. ఈ మేరకు ఆమెకు సమగ్ర వివరాలతో కూడిన పత్రాలను అందించారు. తెనాలి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద మంగళవారం రాత్రి ఆయన మాట్లాడుతూ ఇది రాష్ట్రంలో జరిగిన మరో అతి పెద్ద కుంభకోణమని అనుమానం వ్యక్తం చేశారు. గతేడాది వివరాలు పరిశీలిస్తే అవి కూడా ఇలాగే ఉన్నాయని, అనేక గ్రామాల్లో 55 శాతం మంది అసలు రైతుల పేర్లు ఉండగా మిగిలిన 45 శాతం మందికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఆన్‌లైన్‌ చేశారన్నారు. బీమా, పంట నష్టపరిహారం వంటివన్నీ ఈ వివరాలను అనుసరించే జరుగుతున్న క్రమంలో లోతుగా విచారణ జరిగితే మరిన్ని లోపాలు బయటపడే అవకాశం ఉందన్నారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరిట ప్రభుత్వం పేద ప్రజలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతోందని, ఇది సరికాదన్నారు. ఆయన వెంట తెదేపా నాయకులు, రైతులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని