Amaravati Padayatra: 38వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 38వ రోజుకు చేరింది. బుధవారం చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం చింతలపాలెం నుంచి..

Updated : 08 Dec 2021 16:03 IST

చిత్తూరు: అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 38వ రోజుకు చేరింది. బుధవారం చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం చింతలపాలెం నుంచి ప్రారంభమైంది. ఈరోజు రాజులపాలెం, పంగూరు, కాట్రకాయలగుంట మీదుగా శ్రీకాళహస్తి మండలంలోని విష్ణుకెమికల్స్‌, గుంటకిందపల్లి, జింగిలిపాళెం, ముళ్లపూడి ఎస్టీ కాలనీ, ఊరందూరు, విశాలాక్షి నగర్‌, పానగల్‌ మీదుగా శ్రీకాళహస్తి పట్టణం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి శ్రీకాళహస్తిలో రైతుల బస చేయనున్నారు. 

సీపీఐ నారాయణ మద్దతు

పాదయాత్రకు స్థానికులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్ర చేస్తున్న మహిళల వద్దకు స్థానిక మహిళలు వచ్చి సారె పెట్టి గౌరవించారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని వారంతా నినదించారు. మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రకు సీపీఐ జాతీయ నేత నారాయణ సంఘీభావం తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పాదయాత్ర మార్గంమధ్యలో రైతులను కలిసి తన మద్దతు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని