AP News: 29లోపు బకాయిలు చెల్లించండి: విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశం
అమరావతి: విడ్, సోలార్ పవర్ సంస్థలకు బకాయిల చెల్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు రూ.700 కోట్లు చెల్లించామని విద్యుత్ పంపిణీ సంస్థలు న్యాయస్థానం దృష్టికి తెచ్చాయి. జూన్ నెల బకాయిలు చెల్లించాల్సి ఉందని, వీటిని పంపిణీ చేసేందుకు జనవరి 15 వరకు గడువు పెంచాలని పంపిణీ సంస్థలు న్యాయస్థానాన్ని కోరాయి. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 29లోపు జూన్ నెల బకాయిలు చెల్లించాలని విద్యుత్ పంపిణీ సంస్థలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 29కి వాయిదా పడింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.