logo

యాపిల్‌ రూ.25 సీతాఫలం రూ.75

గుంటూరు మార్కెట్‌లో హైబ్రిడ్‌ సీతాఫలాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. సీతాఫలం పెద్ద సైజు కిలో రూ.200 నుంచి రూ.250 ధర పలుకుతుంది. కిలోకు మూడు తూగుతుండడంతో ఒక్కో పండు ధర సుమారు రూ.75 అవుతుంది. యాపిల్‌

Published : 09 Dec 2021 04:05 IST

గుంటూరు మార్కెట్‌లో హైబ్రిడ్‌ సీతాఫలాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. సీతాఫలం పెద్ద సైజు కిలో రూ.200 నుంచి రూ.250 ధర పలుకుతుంది. కిలోకు మూడు తూగుతుండడంతో ఒక్కో పండు ధర సుమారు రూ.75 అవుతుంది. యాపిల్‌ ధర సుమారు రూ.25 ఉండగా.. ఈ లెక్కన ఒక్క సీతాఫలానికి పెట్టే ఖర్చుతో మూడు యాపిల్స్‌ వచ్చేస్తాయి. ఈ తరహా సీతాఫలం పండ్లలో గింజలు తక్కువగా ఉంటాయని, ఒక్కసారైనా వాటి రుచి చూడాలనుకొంటున్నారు. ఈ ఏడాది  మహారాష్ట్రాలో దిగుబడి తగ్గిపోవడంతో పాటు, డిసెంబరు మాసాంతానికి సీజన్‌ పూర్తవడంతో వీటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

- న్యూస్‌టుడే, పట్నంబజారు

పసరు తిత్తిలో రాళ్ల తొలగింపు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: సర్వజనాసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో అత్యాధునిక చికిత్స విధానాలతో బుధవారం ఇద్దరు రోగులకు పసరుతిత్తి(గాల్‌బ్లాడర్‌)లో రాళ్లు తొలగించారు. గతంలో పొట్ట మొత్తం తెరిచి పెద్దపెద్ద శస్త్రచికిత్సలు చేస్తేనే గానీ పూర్తవ్వని చాలా చికిత్సలను ఇప్పుడు కేవలం నోటి ద్వారా పంపే కెమెరా గొట్టంతోనే పూర్తిచేసే సదుపాయం జీజీహెచ్‌లో అందుబాటులోకి వచ్చింది. శస్త్రచికిత్సలో ఆ విభాగం అధిపతి కవిత, సహాయ ఆచార్యులు నాగూర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని