logo

ప్రధాన నిందితుడి అరెస్టుకు డిమాండ్‌

సర్వజనాసుపత్రిలో జూనియర్‌ వైద్యులు రెండో రోజు బుధవారం తమ సమ్మెను కొనసాగించారు. జిల్లా సంయుక్త పాలనాధికారి రాజకుమారి ఇచ్చిన హామీ మేరకు మంగళవారం వారు ఆందోళన విరమించి వెళ్లారు.

Published : 09 Dec 2021 04:05 IST

ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యులు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: సర్వజనాసుపత్రిలో జూనియర్‌ వైద్యులు రెండో రోజు బుధవారం తమ సమ్మెను కొనసాగించారు. జిల్లా సంయుక్త పాలనాధికారి రాజకుమారి ఇచ్చిన హామీ మేరకు మంగళవారం వారు ఆందోళన విరమించి వెళ్లారు. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయలేదనే విషయాన్ని తెలుసుకున్న వారు బుధవారం విధులకు గైర్హాజరయ్యారు. సాయంత్రం ఆసుపత్రి వద్ద టెంట్‌ వేసి తమకు న్యాయం జరిగేవరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.  సోమవారం తెల్లవారుజామున వచ్చిన రోగి తరుణ్‌ బంధువులు విధుల్లో ఉన్న జూనియర్‌ వైద్యుడిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా డీఎస్పీ సీతారామయ్య ఆసుపత్రికి వచ్చి జూడాలతో చర్చించారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నాన్ని వారికి వివరించారు. నిందితుడిని అరెస్టు చేసిన తర్వాతే విధులకు హాజరవుతామని సంఘ అధ్యక్షుడు షన్ముక్‌తోపాటు నాయకులు భార్గవ్‌, అఖిల్‌, శ్రావణి, అలేఖ్య స్పష్టం చేశారు. సర్వజనాసుపత్రిలో జూనియర్‌ వైద్యులు సమ్మె చేస్తుండటంతో తాత్కాలికంగా గుంటూరు వైద్య కళాశాల నుంచి 20 మంది బోధనా నిపుణులను బుధవారం జీజీహెచ్‌లో నియమించారు. వారంతా విధుల్లో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని