logo

‘అణచివేత చట్టాల రద్దుకు ఉద్యమించాలి’

హక్కులను కాలరాస్తూ, ప్రజా వ్యతిరేక నిరంకుశ చట్టాల రద్దు కోసం ఉద్యమించాలని ఉపా రద్దు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. నాగాలాండ్‌లో గని కార్మికులపై భారత సైన్యం కాల్పులు జరిపి, 14 మందిని హతమార్చిన

Published : 09 Dec 2021 04:05 IST

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : హక్కులను కాలరాస్తూ, ప్రజా వ్యతిరేక నిరంకుశ చట్టాల రద్దు కోసం ఉద్యమించాలని ఉపా రద్దు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. నాగాలాండ్‌లో గని కార్మికులపై భారత సైన్యం కాల్పులు జరిపి, 14 మందిని హతమార్చిన ఘనటను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. బుధవారం ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.ఆంజనేయులు మాట్లాడారు. నాగాలాండ్‌ హత్యాకాండపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా పొరపాటున జరిగిందని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన పౌర సమాజాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించి హత్యలు చేయడం, అణచివేయడం భాజపా విధానంగా మారిందని మండిపడ్డారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ మాట్లాడుతూ.. పర్యావరణ విధ్వంసాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై ఉపా చట్టం కింద అరెస్టు చేయడం దారుణమన్నారు. పేటియాట్రిక్‌ డెమెక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) రాష్ట్ర అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న మోదీ ప్రభుత్వం ప్రజలపై చేస్తున్న యుద్ధంలో భాగమే ఈ హత్యలు, అణచివేత ధోరణి అని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన ప్రపంచ మానవ హక్కుల దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాయకులు వెల్లడించారు. కరపత్రాలను విడుదల చేశారు. సి.హెచ్‌.సుధాకర్‌, ఎ.రవిచంద్ర, రామకృష్ణ, హనుమంతరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని