logo
Published : 09/12/2021 04:05 IST

విజయ డెయిరీ కొత్త యూనిట్‌కు భూమి పూజ

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పాల సేకరణ ధర అత్యధికంగా ఇవ్వడంతో పాటు, పాడి రైతు కుటుంబాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత విజయ డెయిరీదేనని సంస్థ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. వీరవల్లిలో 18.75 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన విజయ డెయిరీ నూతన యూనిట్‌కు బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ రోజుకు మూడు లక్షల లీటర్ల పాలు, లక్ష లీటర్ల పెరుగు ప్రాసెస్‌ లక్ష్యంతో, పూర్తి అధునాతనంగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే సంస్థకు ప్రతి లీటరుకు రెండు రూపాయల చొప్పున, ఏడాదికి రూ.15 కోట్లు ఆదా అవుతుందన్నారు. అనంతరం హనుమాన్‌జంక్షన్‌ క్లస్టర్‌ పరిధిలోని పాడి రైతులకు మొత్తం రూ.1.93 కోట్లు బోనస్‌ పంపిణీ చేశారు. ఎండీ కొల్లి ఈశ్వర్‌బాబు, డైరెక్టర్లు ఎర్నేని సీతాదేవి, దాసరి బాలవర్థనరావు, అర్జా వెంకటనగేష్‌, వేమూరి వెంకటసాయి, ఉయ్యూరు అంజిరెడ్డి, చలసాని చక్రపాణి, వల్లభనేని వెంకట సుబ్బారావు, డీజీఎం అనిల్‌కుమార్‌, మేనేజర్‌ సంపత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని