logo
Published : 09/12/2021 04:05 IST

303 గ్రామాల్లో పాల సేకరణ ప్రారంభం

మొర్సపూడిలో డెయిరీ పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్న కలెక్టరు జె.నివాస్‌

నూజివీడురూరల్‌, న్యూస్‌టుడే:  జిల్లా వ్యాప్తంగా అమూల్‌ డెయిరీ ఆధ్వర్యంలో 303 గ్రామాల్లో పాల సేకరణ ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. నూజివీడు మండలంలోని మొర్సపూడిలో ఉన్న ఓ ప్రైవేటు డెయిరీని బుధవారం ఆయన సందర్శించారు. పాల సేకరణ నుంచి ప్యాకింగ్‌ వరకు తదితరాలను క్షుణ్నంగా పరిశీలించారు. పలు వివరాలను ఫ్యాక్టరీ ఛైర్మన్‌ లక్కింశెట్టి రాజేష్‌కుమార్‌, డెయిరీ టెక్నీషియన్‌ కె.సత్యనారాయణలు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. గ్రామాల్లో పాల కేంద్రాల వద్ద కావాల్సిన కాటాలు తదితరాలన్నింటినీ కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్యదర్శులు, ప్రమోటర్లు సిద్ధమయ్యారన్నారు. సెక్రటరీ, అసిస్టెంట్‌ సెక్రటరీలను మూడు రోజులపాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆయన వెంట జగనన్న పాల వెల్లువ డీడీ వెంకట సిద్ధులు, తహసీల్దారు డీవీఎస్‌ ఎల్లారావు, ఎంపీడీవో జి.రాణి, ఆర్‌ఐ, వీఆర్వో, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని