logo

AP News: ‘ఆ మాటంటే ఎవరినైనా ఇరగదీస్తా’

వినుకొండ మున్సిపల్‌ కౌన్సిల్‌ హల్లో గురువారం అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వావాదం జరిగింది. కౌన్సిల్‌ సమావేశం తర్వాత అధికారుల అనుమతితో ఆరో వార్డు కౌన్సిలర్‌ గంధం కృష్ణవేణి భర్త, వైకాపా నేత ...

Updated : 24 Dec 2021 08:50 IST

సొంత పార్టీ కౌన్సిలర్‌ భర్తపై వినుకొండ మున్సిపల్‌ ఛైర్మన్‌ తీవ్ర ఆగ్రహం

మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ దస్తగిరి, ఆరో వార్డు కౌన్సిలర్‌ కృష్ణవేణి భర్త గంధం కోటేశ్వరావు మధ్య వాగ్వాదం

వినుకొండ, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా వినుకొండ మున్సిపల్‌ కౌన్సిల్‌ హల్లో గురువారం అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వావాదం జరిగింది. కౌన్సిల్‌ సమావేశం తర్వాత అధికారుల అనుమతితో ఆరో వార్డు కౌన్సిలర్‌ గంధం కృష్ణవేణి భర్త, వైకాపా నేత కోటేశ్వరరావు తమ వార్డులో డ్రైనేజీకి ఆటంకంగా ఉన్న ఆక్రమణ తొలగించాలని మార్చి 18న అర్జీ ఇస్తే ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదని పట్టణ ప్రణాళికాధికారి శ్రీలక్ష్మిని ప్రశ్నించారు. దీనిపై పురపాలక సంఘ ఛైర్మన్‌ దస్తగిరి ఆమె వద్దకెళ్లి వివరణ తీసుకునే ప్రయత్నంలో ఉండగా.. ఆక్రమణదారులు ఛైర్మన్‌, పురపాలక కమిషనర్‌తో మాట్లాడుకున్నామని అంటున్నారని గంధం అన్నారు. దీంతో ఛైర్మన్‌ ‘ఆ మాట అంటే ఎవరినైనా ఇరగదీస్తా.. కలెక్టర్‌నైనా ఊరుకునేది లేదంటూ’ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా సంగతి తెలిసి బజారులో వాళ్లు మాట్లాడినట్లు మీరు అంటే ఎలా?..కౌన్సిల్‌ హల్లో మీరు మాట్లాడటానికి హక్కు లేదన్నారు. తాను ప్రజా సమస్యలను ప్రస్థావించాను తప్ప మరొకటి కాదని.. అలా అనుకుంటే ఎవరినీ లోపలికి రానివ్వొద్దని కోటేశ్వరరావు అన్నారు. దీంతో పరిస్థితి శ్రుతి మించకుండా ఆ పార్టీ నేతలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని