logo

AP News: ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి

రాష్ట్రంలో 1992 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాతో పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Published : 02 Jan 2022 12:25 IST

అమరావతి: రాష్ట్రంలో 1992 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాతో పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ముఖ్య కార్యదర్శుల హోదాలో.. వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్న కె.విజయానంద్‌, బి.రాజశేఖర్‌, ఎస్‌ ఎస్‌ రావత్‌లకు పదోన్నతులు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేస్తున్న కె.విజయానంద్‌.. అదే పోస్టులో కొనసాగుతూ ప్రభుత్వ ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పని చేస్తారని ప్రభుత్వం వెల్లడించింది. బి.రాజశేఖర్‌ పాఠశాల విద్యాశాఖలో, ఎస్‌ ఎస్‌ రావత్‌ ఆర్థిక శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదాలో కొనసాగుతారని స్పష్టం చేసింది.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని