logo

ఉత్సాహంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

ప్రేక్షకుల కేరింతలు, చప్పట్ల మధ్య ఈపూరు మండలం ముప్పాళ్లలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు డెబ్బైకి పైగా జట్లు

Published : 15 Jan 2022 03:59 IST

ఆసక్తిగా సాగుతున్న పోటీలు

ఈపూరు, న్యూస్‌టుడే : ప్రేక్షకుల కేరింతలు, చప్పట్ల మధ్య ఈపూరు మండలం ముప్పాళ్లలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు డెబ్బైకి పైగా జట్లు పోటీల్లో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకోగా నా కౌట్‌ కం లీగ్‌ పద్ధతిలో రేయింబవళ్లు పోటీలను నిర్వహిస్తున్నారు. 12న పోటీలు ప్రారంభం కాగా వర్షం కారణంగా మొదటిరోజున కొంతసేపు ఆపి కొనసాగించారు. వివిధ ప్రాంతాలకు చెందిన పెద్ద మొత్తంలో ప్రేక్షకులు ఆటలను తిలకించారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రేయింబవళ్లు పోటీలను నిర్వహించి ఈనెల 16కల్లా ముగించనున్నట్లు పోటీల నిర్వహణ సమన్వయ సభ్యుడు తల్లపనేని రామారావు తెలిపారు.

తొలుత తెలుగు రాష్ట్రాల మధ్య..

దిల్లీ, పంజాబ్‌, నాగపూర్‌ (మహారాష్ట్ర), గుజరాత్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి డెబ్బై జట్లు పేర్లు నమోదు చేసుకోగా ముందుగా ఎ పూల్‌ నుంచి తెలుగు రాష్ట్రాల జట్లను ఆడిస్తున్నారు. మూడో రోజు శుక్రవారం జరిగిన పోటీల్లో ఇనుమెళ్ల శివ జట్టుపై దేచవరం జట్టు, చాగల్లు జట్టుపై బొగ్గరం జట్టు, గోపువారిపాలెం జట్టుపై ఇనుమెళ్ల జట్టు, నరసరావుపేట జట్టుపై దేచవరం జట్టు, ముప్పాళ్ల జట్టుపై తిరుపతి జట్టు, ముప్పాళ్లపై మంత్రాలయం జట్టు, కోదాడ లక్ష్మిపురం జట్టుపై వైజాగ్‌ జట్టు, రావిపాడుపై మంత్రాలయం జట్టు, చిట్టాపురం జట్టుపై ముప్పాళ్ల లక్ష్మి నరసింహ క్లబ్‌ జట్టు, విజయనగరం జట్టుపై ముప్పాళ్ల జేఏసీ జట్టు, విజయనగరంపై దేచవరం జట్టు, చల్లగుండ్లపై బొగ్గరం జట్టు విజయం సాధించాయి.

ఏఎంబీ కబడ్డీ విజేత తెలంగాణ

నాదెండ్ల, న్యూస్‌టుడే : నాదెండ్ల మండలం గణపవరంలో సంక్రాంతి సంబరాలను పురష్కరింకుని ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఏఎంబీ యూత్‌ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు ప్రథమ బహుమతి సాధించింది. తెలంగాణ, తమిళనాడు, ఏపీ నుంచి మొత్తం నలభై జట్లు పోటీ పడినట్లు నిర్వాహకులు తెలిపారు. పల్నాడు హాస్పిటల్స్‌ ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతిని చిన్నగంజాం (ప్రకాశం), గణపవరం ఏఆర్‌ ఫ్రెండ్స్‌, విజయవాడ జీసీ యూత్‌ వరసగా నాలుగైదు స్థానాలను దక్కించుకున్నాయి. చిలకలూరిపేట పురపాలక సంఘం కౌన్సిలర్‌ (తెదేపా) గంగా శ్రీనివాసరావు, తెదేపా నాయకుడు గంగా శ్రీనివాసరావు, ఆళ్ల నాగేశ్వరరావు బహుమతులు అందజేశారు. ఏఎంబీ యూత్‌ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు