logo

ఆధ్యాత్మిక చింతనతో మేలు

మానవ మనుగడలో ఆధ్యాత్మికత కీలకపాత్ర పోషిస్తుందని విశాఖపట్నం మేత్రాసనం కథోలిక పీఠాధిపతి మల్లవరపు ప్రకాశ్‌ అన్నారు. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో

Published : 15 Jan 2022 03:59 IST

ఘనంగా బ్రదర్‌ జోసఫ్‌తంబి మహోత్సవాలు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: మానవ మనుగడలో ఆధ్యాత్మికత కీలకపాత్ర పోషిస్తుందని విశాఖపట్నం మేత్రాసనం కథోలిక పీఠాధిపతి మల్లవరపు ప్రకాశ్‌ అన్నారు. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో బ్రదర్‌ జోసఫ్‌ తంబి 77వ మహోత్సవాల్లో రెండోరోజు శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఫాదర్‌ కరుణాకర్‌ కాసు, రెక్టర్‌ సుధాకర్‌ లారెన్స్‌, ఫాదర్‌ మరియన్న, ఇతర మతగురువులతో కలిసి ఉదయం ప్రత్యేక దివ్యపూజాబలి అర్పించారు. ఈ సందర్భంగా బిషప్‌ మాట్లాడుతూ.. బ్రదర్‌ తంబి ప్రతిఒక్క దైవ సేవకుడికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. క్రీస్తు మార్గాన్ని అనుసరించి ఆయన ధన్యుడయ్యాడని చెప్పారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరికి ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. ఏలూరు మేత్రాసనం పీఠాధిపతి పొలిమెర జయరావు సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, మేత్రాసనం గురువులు, మఠకన్యలు, సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని