logo

కేరళ చేరిన గుడివాడ వృద్ధుడు

రెండు నెలల కిందట రైల్లో పొరపాటున కేరళ రాష్ట్రానికి చేరుకున్న గుడివాడకు చెందిన వృద్ధుడు జాతీయ వృద్ధుల హెల్ప్‌లైన్‌ ద్వారా క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. స్థానిక ఆర్టీసీకి కాలనీ

Published : 15 Jan 2022 03:59 IST

రెండు నెలల తర్వాత హెల్ప్‌లైన్‌ ద్వారా క్షేమంగా ఇంటికి

సత్తార్‌, కుటుంబీకులతో హైల్ప్‌లైన్‌ ఎఫ్‌ఆర్‌వో వెంకట్రావ్‌

గుడివాడ, న్యూస్‌టుడే: రెండు నెలల కిందట రైల్లో పొరపాటున కేరళ రాష్ట్రానికి చేరుకున్న గుడివాడకు చెందిన వృద్ధుడు జాతీయ వృద్ధుల హెల్ప్‌లైన్‌ ద్వారా క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. స్థానిక ఆర్టీసీకి కాలనీ చెందిన అబ్ధుల్‌ సత్తార్‌ పూర్తిస్థాయిలో నడవలేడు. తరచూ రైళ్లలో దూరప్రాంతాలకు వెళ్లొస్తుంటాడు. ఈ క్రమంలో రెండు నెలల కిందట రైల్లో విజయవాడ వెళ్తుండగా నిద్రపోవడంతో కేరళలోని త్రివేండ్రంకు చేరుకున్నాడు. అక్కడ ఓ వీధిలో కదలలేని స్థితిలో ఇబ్బందులు పడ్డాడు. అతడి అవస్థలు గుర్తించిన స్థానిక వృద్ధుడొకరు జాతీయ వృద్ధుల హెల్ప్‌లైన్‌ 14567 నంబరుకు ఫోన్‌లో సమాచారమిచ్చారు. దీంతో అక్కడి హెల్ప్‌లైన్‌ అధికారి వచ్చి సత్తార్‌తో మాట్లాడి గుడివాడగా తెలుసుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలిపి పని చేస్తున్న హెల్ప్‌లైన్‌ అధికారి వెంకట్రావ్‌కు సమాచారం రావడంతో ఆయన గుడివాడ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌కు సమాచారమిచ్చారు. ఆయన సిబ్బందితో సత్తార్‌ భార్య, కుమారుడి చెప్పడంతో వారు త్రివేండ్రానికి వెళ్లి తమ తండ్రిని శుక్రవారం ఇంటికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వెంకట్రావ్‌ మాట్లాడుతూ దేశంలో ఎంతోమంది వృద్ధులు వివిధ కారణాలతో తమ కుటుంబాలకు దూరం కావడంతో స్పందించిన టాటా సంస్థ భారత ప్రభుత్వంతో కలిసి ఈ హెల్ప్‌లైన్‌ను నెలకొల్పిందన్నారు. ఆర్థిక వనరులన్నీ టాటా సంస్థే అందిస్తుంది. గతేడాది అక్టోబరులో వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపత్రి వెంకయ్యనాయుడు ఈ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారని, ఆంధ్రప్రదేశ్‌కు వైజాగ్‌లో రాష్ట్ర కార్యాలయం నిర్వహిస్తున్నారని, రెండు జిల్లాలకో అధికారి వంతున రాష్ట్రంలో ఏడుగురు పని చేస్తున్నామన్నారు. తమ ప్రాంతంలో తప్పిపోయిన వృద్ధుల సమాచారాలను దేశవ్యాప్తంగా పంచుకుని వారి బంధువులు, కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేలా స్థానిక పోలీసుల సాయం తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని