logo

సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలి

అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని అన్నారు. పటమటలోని ఫన్‌టైమ్స్‌లో శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి

Published : 15 Jan 2022 03:59 IST

విద్యార్థికి బహుమతులు అందజేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలంసాహ్ని,

గిరిజా శంకరవరప్రసాద్‌, సాంబశివరావు, హరికృష్ణ

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని అన్నారు. పటమటలోని ఫన్‌టైమ్స్‌లో శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నీలంసాహ్ని మాట్లాడుతూ ఫన్‌టైమ్స్‌తో తనకు ఉన్న అనుభవాన్ని పంచుకున్నారు. సంప్రదాయ కార్యక్రమాలతో పాటు వివిధ పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం అభినందనీయన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భోగిమంటలు వేశారు. చిన్నారులకు భోగిపండ్లు పోశారు. ఎడ్లప్రదర్శన, గంగిరెద్దులు, పొట్టేలు బండి ఆకట్టుకున్నాయి. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫన్‌టైమ్స్‌ కార్యదర్శి చిరుమామిళ్ళ గిరిజాశంకరవరప్రసాద్‌, కోశాధికారి దాసరి హరికృష్ణ, ఉపాధ్యక్షులు వేమూరి సాంబశివరావు, సూరపనేని స్వరూపరాణి, లక్ష్మివరప్రసాద్‌ పాల్గొన్నారు.

హరిదాసుకు బియ్యం పోస్తూ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని