logo

అభ్యుదయవాది.. త్రిపురనేని

మూఢ విశ్వాసాలపై పోరాడిన అభ్యుదయవాది త్రిపురనేని రామస్వామి అని ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం జిల్లా నాయకులు ఆర్‌.పిచ్చయ్య అన్నారు.తుమ్మలపల్లి కళాక్షేత్రంలో త్రిపురనేని రామస్వామి 135వ

Published : 17 Jan 2022 04:55 IST

రామస్వామి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న అరుణ్‌ కుమార్‌, పిచ్చయ్య, భాస్కరరావు తదితరులు

విద్యాధరపురం: మూఢ విశ్వాసాలపై పోరాడిన అభ్యుదయవాది త్రిపురనేని రామస్వామి అని ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం జిల్లా నాయకులు ఆర్‌.పిచ్చయ్య అన్నారు.తుమ్మలపల్లి కళాక్షేత్రంలో త్రిపురనేని రామస్వామి 135వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు అభ్యుదయవాదులు ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిచ్చయ్య మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రశ్నించేతత్వాన్ని కాలరాస్తూ మేధావులు, రచయతలను జైళ్లల్లో నిర్బంధిస్తున్న పాలకులు శతాబ్దకాలం క్రితం జాతిని జాగృతం చేసిన రామస్వామిని గుర్తించే స్థితిలో లేరన్నారు. కుల, మతాలకు అతీతంగా మూఢవిశ్వాసాలను ప్రశ్నించిన వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో అభ్యుదయ రచయతల సంఘం నాయకులు మోతుకూరి అరుణ్‌కుమార్‌, ఆంధ్రాఆర్ట్స్‌ అకాడమి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు, అరసం నగర కన్వీనర్‌ పరుచూరి విజయకుమార్‌, హేతువాద సంఘం నాయకులు భాస్కరరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని