logo

15.2 కిలోల మహా కంద

కృష్ణా జిల్లా అవనిగడ్డ మూడో వార్డుకు చెందిన రైతు అన్నపరెడ్డి వెంకటేశ్వరరావు తన పెరట్లో నాటిన కంద దుంప ఏడాదిన్నర కాలానికి 15.2 కిలోలు బరువు పెరిగింది. ఎటువంటి పోషణ చేయకుండానే దుంప పెద్దది అయిందని

Published : 17 Jan 2022 04:55 IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ మూడో వార్డుకు చెందిన రైతు అన్నపరెడ్డి వెంకటేశ్వరరావు తన పెరట్లో నాటిన కంద దుంప ఏడాదిన్నర కాలానికి 15.2 కిలోలు బరువు పెరిగింది. ఎటువంటి పోషణ చేయకుండానే దుంప పెద్దది అయిందని వెంకటేశ్వరరావు చెప్పారు. దాన్ని అమ్మకానికి తెలిసిన దుకాణదారునికి ఇచ్చినట్లు చెప్పారు. కనుమ రోజున ఆ దుంప దుకాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుండ్రంగా పెరిగిన దుంపను పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. సాధారణంగా ఈ దుంప అయిదారు కిలోల వరకు పెరుగుతుందని.. పెరట్లో కుళ్లిన వ్యర్థాల ద్వారా మంచి పోషకాలు అందడంతో భారీగా పెరిగిందని ఉద్యానాధికారి లక్‌పతి తెలిపారు.

- న్యూస్‌టుడే, అవనిగడ్డ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని