logo

తిరుగు ప్రయాణాలు కిట కిట

సంక్రాంతి సెలవులు ముగియడంతో బస్సుల్లో తిరుగు ప్రయాణాల రద్దీ నెలకొంది. ఈ నెల 7 నుంచి 17 వరకు వివిధ రూట్లలో ఆర్టీసీ సర్వీసులు నడుపుతోంది. ఆదివారం కనుమ పండుగ. ఎక్కువ మంది 16వ తేదీన తిరిగి

Published : 17 Jan 2022 04:55 IST

హైదరాబాద్‌ మార్గంలో ఫుల్‌

పల్లెకు పయనం... బోసిపోయిన నగరం..!

ఈనాడు, అమరావతి

సంక్రాంతి పండగకు జనాలు పల్లె బాట పట్టడంతో ఆదివారం నగరం ఇలా బోసిపోయింది.

కంట్రోల్‌ రూం జంక్షన్‌ నిర్మానుష్యంగా మారిన దృశ్యం

సంక్రాంతి సెలవులు ముగియడంతో బస్సుల్లో తిరుగు ప్రయాణాల రద్దీ నెలకొంది. ఈ నెల 7 నుంచి 17 వరకు వివిధ రూట్లలో ఆర్టీసీ సర్వీసులు నడుపుతోంది. ఆదివారం కనుమ పండుగ. ఎక్కువ మంది 16వ తేదీన తిరిగి బయలుదేరారు. దీంతో విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. రద్దీని నియంత్రించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రయాణికుల అవసరాల మేరకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. డిమాండ్‌ ఉన్న మర్గాల్లో అదనపు సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌కు డిమాండ్‌ ఉంది. జిల్లా నుంచి నడిచే రెగ్యులర్‌ సర్వీసుల్లో 835 సీట్లు ఉండగా, ఇవన్నీ ఇప్పటికే నిండిపోయాయి. దీంతో ప్రత్యేక బస్సులను తిప్పుతున్నారు. కృష్ణా రీజియన్‌లో 40 నడిచాయి. పీఎన్‌బీఎస్‌ నుంచి 32 చొప్పున నడిచాయి. ఇవి కాకుండా మరో 30 బస్సులు కూడా రద్దీని బట్టి తిప్పేందుకు సిద్ధం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర రూట్‌లో ఆదరణ కనిపిస్తోంది. విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లే రెగ్యులర్‌ బస్సుల్లో 488 సీట్లలో ఆదివారం సాయంత్రానికి 280 సీట్లు భర్తీ అయ్యాయి. ఇవన్నీ నిండితే ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. రాయలసీమ జిల్లాలకు వెళ్లే వాటిల్లో 50 శాతం సీట్లు నిండాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని