logo

‘నిరాశ్రయులను ఆదుకోవడమే మతం’

ఒంటరి మహిళలు, వృద్ధులు, నిరాశ్రయులను ఆదుకోవడమే అసలైన మతం అని, ఆ బాటలో పయనించిన బ్రదర్‌ జోసఫ్‌ తంబి ధన్యుడయ్యారని విజయవాడ కథోలిక మేత్రాసనం పీఠాధిపతి తెలగతోటి రాజారావు అన్నారు.

Published : 17 Jan 2022 05:04 IST

ముగిసిన బ్రదర్‌ జోసఫ్‌ తంబి తిరునాళ్లు

దివ్యపూజాబలి అర్పిస్తున్న బిషప్‌ రాజారావు, ఫాదర్లు కరుణాకర్‌ కాసు, సుధాకర్‌, మరియన్న తదితరులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : ఒంటరి మహిళలు, వృద్ధులు, నిరాశ్రయులను ఆదుకోవడమే అసలైన మతం అని, ఆ బాటలో పయనించిన బ్రదర్‌ జోసఫ్‌ తంబి ధన్యుడయ్యారని విజయవాడ కథోలిక మేత్రాసనం పీఠాధిపతి తెలగతోటి రాజారావు అన్నారు. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో ప్రసిద్ధ బ్రదర్‌ జోసఫ్‌ తంబి 77వ వర్ధంతి మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో శనివారం బిషప్‌ రాజారావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన బ్రదర్‌ జోసఫ్‌ తంబి సేవలను వివరించారు. పేదలు, నిరాశ్రయులను ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుండే వారని చెప్పారు. క్రీస్తు అనుభవించిన పంచగాయాలను పొందిన బ్రదర్‌ జోసఫ్‌తంబి ధన్యుడయ్యారని పేర్కొన్నారు. దేశంలో తంబి జీవిత ఘట్టాలను వివరిస్తూ ఓ లేఖను రోమ్‌ నగరంలోని పోప్‌కు ధన్యత పట్టా నిమిత్తం పంపనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక జపమాల, దివ్యపూజాబలిని మేరీమాతా కపూచియన్‌ ప్రావిన్స్‌ ప్రొవిన్షియల్‌ ఫాదర్‌ కరుణాకర్‌ కాసు, రెక్టర్‌ సుధాకర్‌ లారెన్స్‌, విచారణకర్త మరియన్న తదితరులతో కలిసి నిర్వహించారు. ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌, వైఎస్‌ అల్ఫాన్సా, నూతన సభాప్రాంగణ నిర్మాణానికి కృషి చేసిన వారిని ఘనంగా సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని