logo

రైలు మార్గంలో తొలిసారి

భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గన్నవరం రైల్వే స్టేషన్‌ మీదుగా సోమవారం రాత్రి కృష్ణా జిల్లా చేరుకున్నారు. సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేషన్‌ మీదుగా దేశ ప్రముఖుడి రాక ఇదే తొలిసారి.

Published : 18 Jan 2022 03:35 IST

గన్నవరానికి వచ్చిన ఉపరాష్ట్రపతి

రైల్వేస్టేషన్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, చిత్రంలో కలెక్టర్‌ నివాస్‌

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గన్నవరం రైల్వే స్టేషన్‌ మీదుగా సోమవారం రాత్రి కృష్ణా జిల్లా చేరుకున్నారు. సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేషన్‌ మీదుగా దేశ ప్రముఖుడి రాక ఇదే తొలిసారి. కొవిడ్‌ అనంతరం రైల్వేస్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగించే వారే కరవయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఉప రాష్ట్రపతే రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. తొలుత హైదరాబాద్‌ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఉప రాష్ట్రపతి జిల్లాకు చేరుకుంటారని అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు మూడ్రోజుల ముందు నుంచే కలెక్టర్‌ నివాస్‌ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత రైలు మార్గంలో సోమవారం చెన్నై నుంచి ఉప రాష్ట్రపతి రానున్నారని తెలియడంతో ఏర్పాట్లు చేశారు. స్టేషన్‌లో ఒకటో నంబర్‌ ప్లాట్‌ ఫాంపైకి చేరుకొనేందుకు వీలుగా.. రాకపోకల సమయంలో ఎటువంటి భద్రత, ఇతర ఏర్పాట్లలో లోటు లేకుండా డీసీపీ హర్షవర్దనరాజు, ఏసీపీ విజయ్‌పాల్‌, ఆర్డీవో రాజ్యలక్ష్మి, తహసీల్దార్‌ నరసింహారావు, ఇతర అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఉప రాష్ట్రపతి రాకతో గన్నవరం రైల్వేస్టేషన్‌ పేరు ఒక్కసారిగా వెలుగులోకి రావడంపై పట్టణ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్టేషన్‌ అభివృద్ధిపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని