logo

జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

జిల్లాని కరోనా మహమ్మారి చుట్టేస్తుంది. కొత్త కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా 345 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య జిల్లా వ్యాప్తంగా 1,633

Published : 18 Jan 2022 03:35 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాని కరోనా మహమ్మారి చుట్టేస్తుంది. కొత్త కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా 345 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య జిల్లా వ్యాప్తంగా 1,633 నమూనాలను పరీక్షించారు. వీటి ద్వారా పాజిటివిటీ రేటు 21.13 శాతంగా నమోదైంది. జనవరి ఒకటిన 1.62 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 16 రోజులకే 21.13 శాతానికి చేరుకోవడాన్ని బట్టి వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతి స్పష్టమవుతోంది. అత్యధికంగా గుంటూరులో 177, నరసరావుపేట 36, చిలకలూరిపేట 19, మంగళగిరి 17, తెనాలి 15 చొప్పున కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తొలి నుంచి పట్టణాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతుండటం గమనార్హం. కొన్ని ప్రైవేటు ప్రయోగశాలల్లో పరీక్షించిన నమూనాల్లో 40-50 శాతం కరోనా వైరస్‌ కేసులు బయటపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం వెల్లడవుతోంది.

ఇతర దేశాల నుంచి 74 మంది రాక

ఇతర దేశాల నుంచి సోమవారం జిల్లాకు 74 మంది వచ్చారు. వారందరినీ గుర్తించి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటి వరకు 5,533 మందికి పరీక్షలు నిర్వహించగా 23 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు. వారికి సన్నిహితంగా మెలిగినవారిలో ఏడుగురికి కరోనా వైరస్‌ నిర్ధారణ జరిగింది. ఇప్పటి వరకు 12 మందికి కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని