logo

వాలంటీరు ఆత్మహత్య

గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని కొమ్మూరులో వాలంటీరుగా పని చేస్తున్న షేక్‌ ఫాతిమా(21) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపిన వివరాల మేరకు.. వాలంటీరు ఫాతిమా ఏడాదిగా

Published : 18 Jan 2022 06:14 IST

షేక్‌ ఫాతిమా

కొమ్మూరు(కాకుమాను), న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని కొమ్మూరులో వాలంటీరుగా పని చేస్తున్న షేక్‌ ఫాతిమా(21) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపిన వివరాల మేరకు.. వాలంటీరు ఫాతిమా ఏడాదిగా మానసికంగా బాధపడుతుందని, అప్పుడప్పుడు చనిపోవాలని ఉందని.. అంటూ ఉండేదని, తల్లిదండ్రులు నచ్చజెప్పేవారని తెలిపారు. ఇంట్లో తలుపులకు గడియ పెట్టి ఫ్యాన్‌కు చీర కట్టి ఉరి వేసుకున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రి అల్లాఉద్దీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని