logo

‘పీఆర్సీతో ఉద్యోగులకు నష్టం’

రాష్ట్ర ప్రభుత్వ సోమవారం విడుదల చేసిన 11వ పీఆర్సీ ఉత్తర్వులతో ఉద్యోగులకు తీవ్రనష్టం వాటిల్లనుందని ఏపీˆఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అన్నారు. తాజా ఉత్తర్వులతో ఉద్యోగుల జీతాలు

Published : 19 Jan 2022 03:31 IST

సంఘీభావం తెలుపుతున్న విద్యాసాగర్‌, ఇక్బాల్‌, రాజుబాబు, స్వామి, సంపత్‌కుమార్‌ తదితరులు

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ సోమవారం విడుదల చేసిన 11వ పీఆర్సీ ఉత్తర్వులతో ఉద్యోగులకు తీవ్రనష్టం వాటిల్లనుందని ఏపీˆఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అన్నారు. తాజా ఉత్తర్వులతో ఉద్యోగుల జీతాలు పెరగకపోగా తగ్గనున్నాయని దశాబ్దాల తరబడి పోరాడి సాధించకున్న ప్రివిలేజెస్‌ను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీనగర్‌ ఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన జిల్లా, నగర శాఖల కార్యవర్గ సమావేశంలో విద్యాసాగర్‌ మాట్లాడారు. పీˆఆర్సీ చరిత్రలో ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్మెంట్ను పొందడం ఇదే మొదటి సారి అని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఉద్యోగులు పొందుతున్న హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌ను తగ్గించడం దారుణమన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన సీˆసీˆఏను కూడా రద్దు చేయడం శోచనీయమన్నారు. అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఇక్భాల్‌ మాట్లాడుతూ.. తాజా పీˆఆర్సీ ఉత్తర్వులు పింఛనర్లకు కూడా నష్టం కలిగిస్తుందని ఇది రివర్స్‌ పీˆఆర్సీ అని ఉద్యోగులు అంటున్నారని ఎద్దేవా చేశారు. రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్‌ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, నగరశాఖ అధ్యక్ష, కార్యదర్శులు జె.స్వామి, సంపత్‌కుమార్‌, అసోసియేషన్‌ నాయకులు పి.రమేష్‌, సి.హెచ్‌.శ్రీరామ్‌, మధుసూదనరావు, దిలీప్‌కుమార్‌, డి.విశ్వనాథ్‌, సి.హెచ్‌.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఫ్యాప్టో నిరసన..
గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: ప్రభుత్వం విడుదల చేసిన తిరోగమన పీఆర్‌సీని వ్యతిరేకిస్తున్నామని ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఫ్యాప్టో విమర్శించింది. ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం గవర్నర్‌పేటలోని రూరల్‌ తహశీల్దారు కార్యాలయం వద్ద పీఆర్‌సీ జీవో ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం ఫ్యాప్టో ఛైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌ మాట్లాడుతూ.. పీˆఆర్‌సీˆ జీవోలను ఉద్యోగులు ఆమోదించట్లేదని వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో కో ఛైర్మన్‌ నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హెచ్‌ఆర్‌ఏ రేట్లు తగ్గించటం, ఫిట్‌మెంట్‌ను ఐఆర్‌ కంటే తగ్గించటం, సీˆసీˆఏను తీసివేయటం దుర్మార్గమన్నారు. ఏపీˆటీఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ పి.పాండురంగవరప్రసాద్‌, యుటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.పి.మనోహర్‌కుమార్‌, నగర ప్రధాన కార్యదర్శి అనంత్‌, జయలక్ష్మి, రత్నాకర్‌బాబు, పి.శ్రీనివాసరావు, మల్లిఖార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని