logo

మనసున్న అమ్మా.. నీకిదే వందనం

ఎవరైనా పుట్టినరోజు వచ్చిందంటే ఉదయం గుడికి వెళ్లడం, తర్వాత కేకు కోసి వేడుకలు చేసుకోవడం మనం చూస్తుంటాం. మరికొందరు వేడుకలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. గుంటూరులోని పొన్నూరు

Updated : 19 Jan 2022 05:49 IST

అనాథ శవానికి అంతిమ సంస్కారం చేస్తూ..

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: ఎవరైనా పుట్టినరోజు వచ్చిందంటే ఉదయం గుడికి వెళ్లడం, తర్వాత కేకు కోసి వేడుకలు చేసుకోవడం మనం చూస్తుంటాం. మరికొందరు వేడుకలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. గుంటూరులోని పొన్నూరు రోడ్డులో ఉంటున్న సుకన్య మాత్రం తన జన్మదిన వేడుకలను మంగళవారం వినూత్నంగా చేసుకున్నారు. స్థానిక అమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు సేవకుడైన భర్త మంజునాథ్‌ స్ఫూర్తితో ఆమె పుట్టిన రోజున ఉదయం నుంచి రాత్రి వరకు రోజంతా సేవా కార్యక్రమాల్లోనే గడిపారు. అమ్మ ఛారిటబుల్‌ ట్రస్టుకు వెళ్లి రెండు  శవాలకు దహన సంస్కారం చేశారు. ఓ అనాథ శవానికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించగా.. ట్రస్టు సాయం కోరిన కుటుంబ సభ్యుల సమక్షంలోనే మరో చిన్నారి మృతదేహాన్ని ఆమె ఖననం చేశారు. తర్వాత తన ఇంటికి సమీపంలోని పాఠశాల, గుడి ఆవరణల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలోనూ భాగస్వాములయ్యారు. రాత్రి సమయంలో సర్వజనాసుపత్రి, ఏసీ కళాశాల వద్ద ఆకలితో ఉన్న అనాథలకు ఆహారం పంపిణీ చేశారు. ఇలా రోజంతా ఆమె సమాజ హిత కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె భర్త మంజునాథ్‌ ద.మ.రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ గుంటూరు డివిజన్‌ రన్నింగ్‌ బ్రాంచి కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున, తాను కూడా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సుకన్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని