AP News: డిజిటల్‌ లైబ్రరీలతో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ సాధ్యమే: సీఎం జగన్‌

రాష్ట్రంలో డిజిటల్‌ లైబ్రరీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డిజిటల్‌ లైబ్రరీల...

Published : 19 Jan 2022 19:19 IST

అమరావతి: రాష్ట్రంలో డిజిటల్‌ లైబ్రరీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంతో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ సాధ్యమవుతుందన్నారు. అవసరమైన చోట్ల డిజిటల్‌ లైబ్రరీలను నిర్మించాలని సూచించారు. 

వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం జగన్‌ సమీక్షించారు. సమావేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, అధికారులు పాల్గొన్నారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనుల్లో పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఫేజ్‌-1లో 4,530 గ్రామాల్లో లైబ్రరీల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు వెల్లడించారు. తొలిదశలో నిర్మిస్తున్న లైబ్రరీలకు అవసరమైన నెట్‌ కనెక్టివిటీ ఫిబ్రవరి 2022 నాటికి పూర్తవుతుందని సీఎంకు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ నాటికల్లా తొలిదశ  పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంతో వర్క్‌ ఫ్రమ్‌ హోం సాధ్యమవుతుందన్న సీఎం.. ప్రతి  డిజిటల్‌ లైబ్రరీలో డెస్క్‌ టాప్‌, యూపీఎస్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో పాటు డెస్క్‌ టాప్‌ టేబుల్స్‌, సిస్టం చెయిర్స్‌, ఫ్యాన్‌లు, ట్యూబ్‌లైట్లు, ఐరన్‌ రాక్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఫేజ్‌-1లో మిగిలిపోయిన డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాలను ఫేజ్‌-2లో కవర్‌ అయ్యేలా చూడాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని