logo

దాచేపల్లి-మాచర్ల రహదారికి మహర్దశ

దాచేపల్లి-మాచర్ల జాతీయ మార్గం అభివృద్ధికి మరో ముందడుగు పడింది. దశల వారీగా నాలుగు వరుసల జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు

Published : 20 Jan 2022 03:15 IST

ఏటి అగ్రహారం, న్యూస్‌టుడే: దాచేపల్లి-మాచర్ల జాతీయ మార్గం అభివృద్ధికి మరో ముందడుగు పడింది. దశల వారీగా నాలుగు వరుసల జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. పల్నాడు ప్రాంతంలో ప్రజా, వాణిజ్య రవాణాకు ఎంతగానో ఉపకరించే ఈ మార్గపు విస్తరణకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌హెచ్‌-167ఏడీలోని మాచర్ల-దాచేపల్లి సెక్షన్‌ వరకు పవిడ్‌ షోల్డర్స్‌ (రహదారిపై ప్రయాణించే భాగానికి పక్కన సమాంతరంగా వేసే కొంత చదును భాగం)తో రెండు వరుసల రహదారిగా అభివృద్ధి చేయడానికి రూ.403.22 కోట్లు బడ్జెట్‌లో మంజూరు చేసినట్లు కేంద్ర రోడ్లు, రవాణ శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నిధులు కేటాయించడంపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు హర్షం వ్యక్తం చేసి, కేంద్ర ప్రభుత్వానికి, మంత్రి నితిన్‌ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు ప్రాంత అభివృద్ధిలో ప్రధాన మార్గాలైన కొండమోడు-పేరేచర్ల, దాచేపల్లి-మాచర్ల మార్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, వీటి విషయంలో సంబంధింత కేంద్ర మంత్రి, అధికారులను అనేక మార్లు కలిసి వీటి ప్రాధాన్యం వివరించామన్నారు. దశల వారీగా ఈ మార్గాలు అభివృద్ధి చెంది పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నట్లు ఎంపీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని