logo

పురాతన వస్తువుల స్వాధీనం

వినుకొండ సమీపంలో తవ్వకాల్లో బయటపడిన పురాతన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండమెట్ల వద్ద పురావస్తుశాఖ పరిధిలోని నరసింహస్వామి ఆలయం పక్కన

Published : 20 Jan 2022 03:15 IST

తవ్వకాల్లో బయట పడిన సామగ్రి

వినుకొండ, న్యూస్‌టుడే: వినుకొండ సమీపంలో తవ్వకాల్లో బయటపడిన పురాతన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండమెట్ల వద్ద పురావస్తుశాఖ పరిధిలోని నరసింహస్వామి ఆలయం పక్కన భక్తులు ప్రహరీ నిర్మించేందుకు జేసీబీతో పునాది తీయిస్తుండగా సోమవారం పురాతన మట్టి కుండ కనిపించింది. అందులో రంగురంగుల సుద్దరాళ్ల మాదిరి ముద్దలు బయటపడ్డాయి. వాటిని ఖనిజాలనుకున్న స్థానికులు వచ్చి కొన్ని తీసుకెళ్లారు. ఆలయ సేవకుడు ఫిర్యాదుతో పోలీసులు మంగళవారం వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పురావస్తుశాఖ ఏడీ సురేష్‌ను ‘న్యూస్‌టుడే’ ఫోన్‌లో సంప్రదించగా బయటపడిన కుండ ప్రాచీన లేదా మధ్యయుగం నాటిదో అయి ఉండొచ్చని అందులో లభ్యమైన లోహపు ముద్దలను పరిశీలించాల్సి ఉందన్నారు.

మట్టి కుండలో లభ్యమైన రంగు రాయి ముద్ద

గుప్త నిధుల కోసం తవ్వకాలు: కొండ మెట్ల వైపు రాజుల కాలంలో కట్టిన కోట రాతి గోడ ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. చుట్టూ పురాతన ఆలయాలు కనిపిస్తాయి. రాజుల కాలంలో నిర్మించినందున తిమ్మాయిపాలెం రోడ్డులోని పాత కాలం నాటి గుడిలో గుప్త నిధులున్నాయన్న భావనతో ఆగంతుకులు ఇష్టానుసారం తవ్వకాలు చేశారు. పురావస్తుశాఖ శ్రద్ధపెడితే ఈప్రాంతంలో మరెన్నో చారిత్రక ఆధారాలు లభిస్తాయని స్థానికులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని