logo

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం... కృష్ణా జిల్లా నందిగామ మండలం గోళ్లమూడి గ్రామానికి చెందిన

Published : 20 Jan 2022 03:15 IST

నందిగామ గ్రామీణం: వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం... కృష్ణా జిల్లా నందిగామ మండలం గోళ్లమూడి గ్రామానికి చెందిన కటారపు శివకృష్ణ(33) 11 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి, మొక్కజొన్న సాగు చేశారు. వరి ఎకరానికి 25 బస్తాలు, మొక్కజొన్న ఎకరానికి మూడు క్వింటాళ్ల మాత్రమే దిగుబడి రావడంతో తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయం కోసం రూ.10 లక్షలు అప్పు చేయడం, పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పు తీర్చలేననే మనోవేదనతో బుధవారం తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతనికి భార్య ఆదిలక్ష్మి, కుమారుడు శ్యామ్‌(10), కుమార్తె షైనీ(8) ఉన్నారు. కుమారుడికి మాటలు రావు. ఇంటి పెద్ద తనువు చాలించడంతో తమకు దిక్కెవరంటూ భార్య, పిల్లలు బోరున విలపించారు. దీనిపై ఎస్సై సురేష్‌ మాట్లాడుతూ.. కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని