logo

ఎంఐజీ ప్లాట్లకు 500 దాటిన దరఖాస్తులు

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరులో నిర్మించ తలపెట్టిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ ఎంఐజీ ప్లాట్ల కోసం దరఖాస్తులు బుధవారం నాటికి 500 దాటాయి. 81

Published : 20 Jan 2022 03:15 IST

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరులో నిర్మించ తలపెట్టిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ ఎంఐజీ ప్లాట్ల కోసం దరఖాస్తులు బుధవారం నాటికి 500 దాటాయి. 81 ఎకరాల్లో ఎంఐజీ ప్లాట్లతో నిర్మిస్తున్న ఈ టౌన్‌ షిప్‌లో 200 చదరపు గజం విస్తీర్ణంలో ఎంఐజీ-2 కేటగిరిలో 239 ప్లాట్లు, 240 చదరపు గజాల విస్తీర్ణంలో ఎంఐజీ-3 కేటగిరిలో 289 ప్లాట్లు కలిపి మొత్తంగా 528 ప్లాట్లను నిర్మించనున్నారు. సాలీనా రూ.18లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న మధ్య తరగతి వర్గాల వారి కోసం నిర్మిస్తున్న ఈ ప్లాట్లలో చదరపు గజం రూ.17499గా నిర్ణయించారు. ఈ ప్లాట్ల కోసం ఈ నెల 11న ఆన్‌లైన్‌ విధానంలోనూ, నేరుగా సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద ప్రారంభించిన బుకింగ్‌ ప్రక్రియలో ఇప్పటి వరకు (19వ తేది సాయంత్రం 5 గంటల సమయానికి) 500 దరఖాస్తులు అందినట్లు సీఆర్‌డీఏ అధికారులు ప్రకటించారు. బుకింగ్‌ జరిగిన వాటిలో 240 చదరపు గజాల విస్తీర్ణ ప్లాట్లు 238 బుకింగ్‌ జరగ్గా, 200 గజాల ప్లాట్లు 262 బుక్‌ అయినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఎంఐజీ ప్లాట్ల నిర్మాణ ప్రక్రియ జరగనుండగా నవులూరు ప్రాంత ప్లాట్ల లేఅవుట్‌కు విశేష ఆదరణ ప్రజల నుంచి లభిస్తోందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల 10వ తేదీ వరకు జరుగుతుందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని