logo

గుంటూరు నగర కమిషనర్‌ అనురాధ బదిలీ

గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధను ఆంధ్రప్రదేశ్‌ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ)గా ప్రభుత్వం బదిలీ చేసింది. చల్లా

Published : 20 Jan 2022 03:15 IST

ఈనాడు-అమరావతి: గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధను ఆంధ్రప్రదేశ్‌ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ)గా ప్రభుత్వం బదిలీ చేసింది. చల్లా అనురాధ స్థానంలో కమిషనర్‌గా ఇంకా ఎవరినీ నియమించలేదు. గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్‌గా అనురాధ బాధ్యతలు చేపట్టేనాటికి వార్డు సచివాలయాల వ్యవస్థ తొలిదశలో ఉంది. సచివాలయాలను ఏర్పాటుతోపాటు సేవలను ప్రజలకు చేరువ చేయడంలో కృషిచేశారు. గుంటూరు నగరంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం, గతంలో ఇక్కడ పనిచేసి ఉండటంతో కరోనా తొలి, రెండోదశలను సమర్థంగా ఎదుర్కొని యంత్రాంగాన్ని ముందుకు నడిపించారు. నగరంలో పోగుపడుతున్న వృథా ప్లాస్టిక్‌ను సేకరించి దాని నుంచి బయోడీజిల్‌ తీసే ప్రాజెక్టును చేపట్టారు. అందుబాటులో ఉన్న నిధులతో అవసరమైన నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమన్వయం చేయగలిగారు. గుంటూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశారు. ప్రత్యేకాధికారుల పాలనలోనూ సమన్వయంతో ఇబ్బందులు లేకుండా పాలన కొనసాగించారు. డయల్‌ యువర్‌ కమిషనర్‌, స్పందన కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. అనురాధ స్థానంలో ఐఏఎస్‌ను కమిషనర్‌గా నియమిస్తారని చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని