logo

నాసిరకంగా రైల్వే ఆహారం పెరుగుతున్న ఫిర్యాదులు

విశాఖపట్నంకు చెందిన మోహన్‌ సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఆగిన తర్వాత పెరుగు అన్నం ప్యాకెట్‌ తీసుకున్నాడు. బండి కదిలిన

Published : 20 Jan 2022 03:29 IST

విజయవాడ, న్యూస్‌టుడే

విశాఖపట్నంకు చెందిన మోహన్‌ సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఆగిన తర్వాత పెరుగు అన్నం ప్యాకెట్‌ తీసుకున్నాడు. బండి కదిలిన తర్వాత తినేందుకు పొట్లం విప్పి చూడగా.. ముక్క వాసన రావడంతో వెంటనే పారవేశారు.

విజయవాడ రైల్వే స్టేషన్‌ 4, 5 ప్లాట్‌ఫారంలో జాషువా అనే ప్రయణికుడు వెజ్‌ బిర్యాని కొనుగోలు చేశారు. రైలు ఎక్కి పొట్లం విప్పి చూడగానే.. చల్లగా పాచిపోయినట్లు ఉంది. వెంటనే ట్విట్టర్‌ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశారు.

రైలు ప్రయాణంలో దినేష్‌ అనే ప్రయాణికుడు ఇడ్లీ కొని తిన్నాడు. తర్వాత కడుపులో నొప్పి వచ్చి, వాంతి చేసుకునే పరిస్థితిని ఎదుర్కొన్నారు.

రైల్వే స్టేషన్‌, రైళ్లల్లో ఆహార పదార్థాలు నాసిరకంగా ఉంటున్నాయి. ఎక్కువ శాతం ప్రయాణికులు విజయవాడ జంక్షన్‌ పెద్దది కావడంతో, ఆహార పదార్థాలు బాగుంటాయని ఇక్కడే ఎక్కువ మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ఇప్పుడు నాసికరంగా ఉంటోందని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఆహార పదార్థాల నాణ్యత అంతంత మాత్రంగా ఉంటోంది. చల్లగా, పాచిపోయి ఉంటున్నాయి. దీంతో ప్రధాన రైల్వేస్టేషన్ల బయట హోటళ్లలో నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు చేస్తున్నారు. విజయవాడ మీదుగా ప్రతి రోజూ 250కిపైగా ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజరు రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, నిత్యం వేల సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా అల్పాహారం, భోజనం, బిరియానీ, పెరుగు అన్నం ముక్కు వాసన కొడుతన్నాయని చాలా మంది నుంచి అధికారులకు ఫిర్యాదులు వెళుతున్నాయి. రైలు ప్రయాణంలో చేసే ఫిర్యాదుల్లో ఎక్కువగా.. నిణ్యతపైనే ఉంటున్నాయి. అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ.. నాణ్యతను పరిశీలిస్తున్నా విజయవాడ రైల్వేస్టేషన్‌లో కొందరు క్యాంటీన్‌, స్టాళ్ల నిర్వాహకులు ఉదయం వండినవి సాయంత్రం, సాయంత్రం చేసినవి రాత్రి సమయాల్లో విక్రయిస్తూ.. మిగిలిపోయినవి ప్రయాణికులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. కింది స్థాయి సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రయాణికులు మోసపోతున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో మొత్తం 10 ప్లాట్‌ఫారాలు ఉండగా.. చాలా మంది నిర్వాహకులు నాసిరకం పదార్థాలు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లవెత్తుతున్నాయి. ఆహారం తయారు చేసే కార్ఖానాలు రైల్వేస్టేషన్‌లోనే సంబంధిత క్యాంటీన్లు, స్టాళ్ల వద్దనే ఉంచాలని నిబంధనలున్నా.. చాలా మంది పాటించడం లేదు. రైల్వేస్టేషన్‌ బయట ఏర్పాటు చేయడంతో.. సిబ్బంది తనిఖీలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇక రైళ్లల్లో విక్రయించే ఆహారం నాణ్యత బాగుండటం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ.. నాసిరకం ఆహారాన్ని విక్రయించడంపై మండిపడుతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అధికారుల దృష్టికి వస్తే మాత్రం చర్యలకు వెనుకాడడం లేదు. ఆయా క్యాంటీన్లు, స్టాళ్ల నిర్వాహకులకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు.

ఫిర్యాదు చేస్తే చర్యలు : డీఆర్‌ఎం

రైల్వేస్టేషన్‌, రైళ్లల్లో ఎవరైనా నాసిరక ఆహార పదార్థాలు విక్రయిస్తే వెంటనే 1800111321 లేదా 139 నెంబర్లకు ఫిర్యాదు చేయొచ్ఛు వెంటనే మేం చర్యలు తీసుకుంటామని డీఆర్‌ఎం షివేంద్ర మోహన్‌ స్పష్టం చేశారు. ప్రయాణికులు ట్విట్టర్‌ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు