logo

ముద్ద పెట్టేదెలా?

విద్యాలయాల్లో విద్యార్థులకు గోరుముద్ద పేరుతో ప్రత్యేక మెనూ అమలుచేస్తున్న ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. వంట ఏజెన్సీలు డబ్బుల కోసం కళ్లుకాయలు కాసేలా చూస్తున్నాయి. ఇప్పటికే అప్పుల

Published : 20 Jan 2022 03:29 IST

జగ్గయ్యపేట గ్రామీణం, విస్సన్నపేట, న్యూస్‌టుడే

విద్యాలయాల్లో విద్యార్థులకు గోరుముద్ద పేరుతో ప్రత్యేక మెనూ అమలుచేస్తున్న ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. వంట ఏజెన్సీలు డబ్బుల కోసం కళ్లుకాయలు కాసేలా చూస్తున్నాయి. ఇప్పటికే అప్పుల ఊబిలో మునిగామని భోజన ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా విద్యాలయాల్లో వడ్డించిన ఆహారానికి ప్రభుత్వం సుమారు రూ.8కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.

పెరగని కేటాయింపులు

గత ఆహార విధానానికి భిన్నంగా ప్రభుత్వం నూతన మెనూ ప్రకటించినా నేటి వరకు అందుకు తగిన విధంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కందిపప్పు, వంట నూనె, కూరగాయల ధరలు పెరగగా కేటాయింపులు మాత్రం పెరగలేదు. ప్రతి విద్యార్థికీ రోజూ కనీసం 50గ్రాముల కందిపప్పు అవసరముండగా, బహిరంగ మార్కెట్లో దీని ధర రూ.7.50లకు చేరుకుంది. విద్యార్థికి మొత్తం భోజనానికి ప్రభుత్వం ఇస్తున్న మొత్తం గరిష్టంగా రూ.7లు మాత్రమే. ఒకానొక దశలో టమాటా ధర ఆకాశాన్నంటింది. అంతంతమాత్రపు ధర చెల్లిస్తున్న అధికారులు ప్రతి విద్యార్థికీ టమాటా పప్పు, టమాటా పచ్చడి, కూరగాయలతో కూడిన అన్నం వడ్డించకుంటే చర్యలు తప్పవంటూ నిర్వాహకులను హెచ్చరించారు. పథకం ఆరంభంలో వంటనూనె కిలో రూ.60లు ఉండగా, ప్రస్తుతం రూ.160లకు చేరుకుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న మెనూ ప్రకారం పెట్టాలంటే కనీసం ప్రాథమిక విద్యార్థికి రూ.10లు, ఉన్నత విద్యార్థికి రూ.15లు చెల్లించకుంటే రానున్న విద్యాసంవత్సరంలో పథకం అమలు చేయలేమంటూ నిర్వాహకులు తెలిపారు.

జిల్లాలోని పాఠశాలలు 2,610

మధ్యాహ్నభోజన పథకం కింద (ఒక్కో విద్యార్థికి)

ప్రాథమిక పాఠశాల : రూ.4.69లు

విద్యార్థులు : 1,51,719

ఉన్నత పాఠశాల : రూ.7లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని