logo

పీఆర్సీ ఉత్తర్వుల రద్దుకు డిమాండ్‌

పీఆర్సీ ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు, సీసీఏ రద్దు తదితర అంశాలకు వ్యతిరేకంగా ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యాలయం ఉద్యోగులు బుధవారం మధ్యాహ్నం భోజన విరామం

Published : 20 Jan 2022 03:29 IST

ఆర్‌అండ్‌బీ భవన సముదాయాల ముందు ఆందోళన చేస్తున్న ఉద్యోగులు,

సంఘ అధ్యక్షుడు మునీకేశవులు తదితరులు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: పీఆర్సీ ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు, సీసీఏ రద్దు తదితర అంశాలకు వ్యతిరేకంగా ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యాలయం ఉద్యోగులు బుధవారం మధ్యాహ్నం భోజన విరామం సమయంలో విజయవాడ ఎంజీ రోడ్డులోని ఆర్‌అండ్‌బీ బిల్డింగ్స్‌ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ(ప్రధాన కార్యాలయం) ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మునీకేశవులు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జోవోలను వెంటనే రద్దు చేయాలని, సీఎస్‌ కమిటీ సిఫార్సులను నిలుపుదల చేసి, అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదికను బయటపెట్టాలని కోరారు. 30 శాతం ఫిట్‌మెంట్‌, పాత విధానంలో హెచ్‌ఆర్‌ఎ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంఘం ఉపాధ్యక్షుడు మహేష్‌, కార్యదర్శి విజయకుమార్‌, వెంకటరవి, మహిళా విభాగం ప్రతినిధి అనుపమ, దేవి తదితరులు పాల్గొన్నారు.

వెంటనే ఉపసంహరించుకోవాలి

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: ఉద్యోగులకు నష్టం కలిగించే కొత్త పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్త పీఆర్సీలో జీతాలు పెరుగుతాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఉద్యోగులు చివరకు భంగపడ్డారన్నారు. హెర్‌ఆర్‌ఏ విషయంలోనూ తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.హెచ్‌.బాబూరావు, కాశీనాథ్‌, ఎన్‌.సి.హెచ్‌.శ్రీనివాస్‌ తదితరులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎం.డేవిడ్‌, జ్యోతి, టి.ప్రవీణ్‌, గోపాల్‌, డి.స్టిఫెన్‌బాబు, వి.సాంబులు, టి.తిరుపతమ్మ, ఎం.బుజ్జమ్మ, జె.విజయలక్ష్మి, శీలం దాసు, సింగంపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని