logo

మచిలీపట్నంలో పోక్సో కోర్టు

రెండేళ్ల కిత్రం మచిలీపట్నం నుంచి విజయవాడకు తరలిన ప్రత్యేక కోర్టు తిరిగి బందరులోనే ఏర్పాటు కానుంది. పోక్సో చట్టం కింద నమోదైన కేసుల విచారణలో భాగంగా

Published : 20 Jan 2022 03:29 IST

సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా జడ్జి రామకృష్ణ

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: రెండేళ్ల కిత్రం మచిలీపట్నం నుంచి విజయవాడకు తరలిన ప్రత్యేక కోర్టు తిరిగి బందరులోనే ఏర్పాటు కానుంది. పోక్సో చట్టం కింద నమోదైన కేసుల విచారణలో భాగంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కోర్టును విజయవాడకు తరలించినప్పుడు వివిధ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. బాలికలపై జరిగే లైంగిక దాడులకు సంబంధించి ఈ యాక్టు కింద నమోదయ్యే కేసులను త్వరితగతిన విచారణ నిర్వహించే దిశగా హైకోర్టు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోనే తిరిగి ఈ కోర్టును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆ దిశగా న్యాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయస్థానాల సముదాయ భవనంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 10గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు పోలియో జడ్జి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ భట్టు దేవానంద్‌లు వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం జిల్లా జడ్జి గూడూరు రామకృష్ణ, న్యాయమూర్తులు నరసింహమూర్తి, సీతారామకృష్ణారావు, రాజారామ్‌, శ్రీనివాస్‌, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు కోట మెహర్‌ ప్రసాద్‌, పీపీ వరదరాజులు, ఏపీపీలు వడ్డి జితేంద్ర, చంద్రశేఖర్‌, న్యాయవాదులు పరిశీలించారు. దీని కోసం నిర్మిస్తున్న భవనం అందుబాటులోకి రాగానే అక్కడి నుంచి కార్యకాలపాలు సాగుతాయని జిల్లా జడ్జి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని