logo

పెంచమంటే... తుంచుతారా

పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం గురువారం ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలోని విగ్రహాలను బయటకు తీశారు. ఆలయం బయటకు అర్చకులు తీసుకొచ్చి రజకులకు అందించగా

Published : 21 Jan 2022 04:04 IST

పీఆర్సీపై భగ్గుమన్న ఉద్యోగులు

  మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లలో బైఠాయింపు

ఈనాడు, అమరావతి - మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

పోలీసులు వాహనంలో తరలిస్తుండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం గురువారం ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలోని విగ్రహాలను బయటకు తీశారు. ఆలయం బయటకు అర్చకులు తీసుకొచ్చి రజకులకు అందించగా వారు విగ్రహాలను తలపై పెట్టుకొని గ్రామంలోని రంగుల మండపం వరకు మోసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భారీ ఊరేగింపు నిర్వహించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, తప్పెట్లు, కోలాటాల నడుమ తరలివస్తున్న తిరుపతమ్మ పరివారానికి భక్తులు ఎదురేగి భక్తి పారవశ్యంతో స్వాగతం పలికారు. టెంకాయలు, ప్రసాదాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రామంలోని రంగుల మండపానికి చేరుకున్న విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఇన్‌ఛార్జి ఈవో భ్రమరాంబ, ఛైర్మన్‌ యింజం చెన్నకేశవరావు, సర్పంచి వేల్పుల పద్మకుమారి దంపతులు, తహసీల్దారు నాగభూషణం, ఎంపీడీవో పద్మ, ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సందడి చేసిన అఖండ ఎడ్లజత:

తిరుపతమ్మ పరివార దేవతామూర్తుల విగ్రహాలను ఎడ్లబండ్లపై ఉంచి జగ్గయ్యపేటకు తరలిస్తారు. ఒక్కోబండికి ఒక విగ్రహం చొప్పున 11 బండ్లు ఉంటాయి. ఎడ్లబండి ఏర్పాటుకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. లాటరీలో తిరుపతమ్మ విగ్రహాన్ని తీసుకుపోయే మొదటి బండి చింతల సీతారామయ్య కైవశం చేసుకున్నారు. ఆ బండికి అఖండ సినిమాతో విశేష ప్రచుర్యం పొందిన ఎడ్లను కట్టాలని నిర్ణయించుకొని ఎడ్ల యజమానిని ఒప్పించారు.

జిల్లాలోని మచిలీపట్నం సహా పలు ప్రాంతాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఉద్యోగుల పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌ తదితర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫ్యాప్టో, జాక్టో పిలుపు మేరకు మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ కార్యాలయ ముట్టడి, అన్ని మండలాల్లో నిరసనలు హోరెత్తాయి. ప్రధానంగా మచిలీపట్నానికి వచ్చే దారులన్నీ ఉపాధ్యాయులతో కిక్కిరిసిపోయాయి. ప్రతి మండలం నుంచి వందలాది మంది ఉపాధ్యాయులు రకరకాల మార్గాల్లో.. మచిలీపట్నం చేరుకున్నారు. ప్రతి మండలంలో పోలీసులు అడ్డుకుంటున్నా, బస్సులు, వాహనాలను తనిఖీలు చేస్తున్నా.. వారిని దాటుకుంటూ జిల్లా కేంద్రానికి వేలాది మంది చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో అత్యధికశాతం మంది విధులకు గైర్హాజరై.. కలెక్టరేట్‌ ముట్టడికి తరలివెళ్లారు. మచిలీపట్నం నగరం మొత్తం పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ప్రధాన కూడళ్లలో బారికేడ్ల ముందే బైఠాయించి ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. నగరం మొత్తం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నిరసనకారులను వ్యానులోకి ఎక్కిస్తూ..

విజయవాడ సహా పలు మండలాల్లో ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ కార్యాలయాల వద్ద ఫ్లకార్డులు పట్టుకుని నిరసనను తెలియజేశారు.మచిలీపట్నం కలెక్టరేట్‌ చుట్టుపక్కల వలయంలా పోలీసులు మోహరించి లోపల ఉన్నవాళ్లు బయటకు రాకుండా, బయట నుంచి ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు లోపలికి పంపించారు. దీంతో పలువురు సిబ్బంది తమ విభాగాలకు చెందిన అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగుల విషయంలో కలెక్టర్‌ బంగ్లా గేటు వైపు విధులు నిర్వహిస్తున్న ఒక ఎస్సై అమర్యాదగా వ్యవహరించారంటూ ఆందోళనకు దిగారు. ఎస్సై వ్యవహారశైలిపై జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు.

జిల్లాలో పలుచోట్ల నిరసనలు

● జగ్గయ్యపేట మండలం, పామర్రు నుంచి చలో కలెక్టరేట్‌ ఆందోళనలో పాల్గొనేందుకు బయలుదేరిన ఉపాధ్యాయ సంఘాల నాయకులను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ● విజయవాడ ఆర్‌అండ్‌బి కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసనకు దిగారు.


ప్రభుత్వం మోసం చేసింది..

ఉపాధ్యాయ, ఉద్యోగులు అందరినీ ప్రభుత్వం మోసం చేసింది. న్యాయబద్ధంగా అడిగిన పీఆర్‌సీ ఇవ్వకుండా, హక్కుల సాధనకు నిరసన తెలియజేస్తుంటే అక్రమ అరెస్టులు చేసి నిర్భందం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎస్‌ రాజకీయ నాయకుల మాదిరిగా మాట్లాడటం సరికాదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అన్నింటినీ తక్షణం ఉపసంహరించుకోవాలి. అప్పుడు మాత్రమే చర్చలకు వెళ్తాం. 27శాతానికి మించి పీఆర్‌సీ ఇవ్వాలి, పాతహెచ్‌ఆర్‌ఏ స్లాబులను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నాం.

- ఎన్‌.వెంకటేశ్వర్లు, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు


చీకటి జీవోలు రద్దయ్యే వరకు ఉద్యమం..

ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవోలు రద్దయ్యేవరకు ఉద్యమం ఆగదు. మా డిమాండ్‌ పరిష్కరించకపోతే అన్ని సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. జులై 2019 నుంచి మార్చి 2020 వరకు ఇచ్చిన ఐఆర్‌ 27శాతాన్ని రికవరీ చేస్తామని చెప్పడం దారుణం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై పునరాలోచన చేయాలి.

- తమ్ము నాగరాజు, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి


అరెస్టులతో అడ్డుకోలేరు..

ప్రభుత్వం ఇచ్చిన జీవోల వల్ల ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనుదారులు, సచివాలయ సిబ్బంది.. అందరికీ నష్టమే. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనించాలి. ఐదేళ్లకోసారి ఇచ్చే పీఆర్‌సీని 10ఏళ్లకు చేసే ఆలోచన విరమించుకోవాలి. అశుతోష్‌మిశ్రా ఇచ్చిన నివేదికను బయటపెట్టాలి. అధికారుల ప్రతిపాదనలను రద్దు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన జీవోల వల్ల ఉపయోగం లేదు.

- మద్ది బాబూరాజేంద్రప్రసాద్‌, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని