logo

పీహెచ్‌డీ కోర్సు పేరుతో మోసం

పీహెచ్‌డీ కోర్సులో చేరుస్తామని మోసానికి పాల్పడిన ఓ కన్సెల్టెన్సీపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నానికి చెందిన వి.వెంకటరమణ కుమారుడు పాండురంగారావు పీహెచ్‌డీ కోర్సుకు సంబంధించి గతేడాది జూన్‌లో లబ్బీపేటలోని తేజ

Published : 21 Jan 2022 04:04 IST

కృష్ణలంక, న్యూస్‌టుడే: పీహెచ్‌డీ కోర్సులో చేరుస్తామని మోసానికి పాల్పడిన ఓ కన్సెల్టెన్సీపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నానికి చెందిన వి.వెంకటరమణ కుమారుడు పాండురంగారావు పీహెచ్‌డీ కోర్సుకు సంబంధించి గతేడాది జూన్‌లో లబ్బీపేటలోని తేజ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీని సంప్రదించారు. ఈక్రమంలో సంస్థ నిర్వాహకురాలు కలపాల నీలవేణి హైదరాబాద్‌లో తనకు తెలిసిన సురేష్‌ ద్వారా కాన్పూర్‌లోని ఛత్రపతి షాబూజీ మహరాజ్‌ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్‌ను ఇప్పిస్తామని చెప్పి, వారి నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నారు. అనంతరం యూనివర్సిటీ నుంచి వచ్చినట్లు అడ్మిషన్‌ లెటర్‌, ఐడీ కార్డులను పంపించారు. వాటిని పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో తాము మోససోయామని గ్రహించిన వెంకట రమణ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని