logo

నేటి నుంచి 24 వరకు ఐదు రైళ్ల రద్దు

రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు ప్యాసింజరు రైళ్లను ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు

Published : 21 Jan 2022 04:04 IST

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు ప్యాసింజరు రైళ్లను ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. రేపల్లె-తెనాలి (07873), తెనాలి-రేపల్లె(07874), రేపల్లె-తెనాలి(07875), తెనాలి-రేపల్లె(07876) ప్యాసింజరు రైళ్లను శుక్రవారం నుంచి నాలుగు రోజులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కాచిగూడ-నడికుడి-కాచిగూడ మధ్య నడిచే రైలు(00791/07792)ను రద్దు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు