logo

విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా

విదేశాల నుంచి వచ్చిన వారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయగా గురువారం ముగ్గురికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. తెనాలి పీపీయూనిట్‌ సాలిపేట పరిధిలో ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేశారు.

Published : 21 Jan 2022 04:04 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: విదేశాల నుంచి వచ్చిన వారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయగా గురువారం ముగ్గురికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. తెనాలి పీపీయూనిట్‌ సాలిపేట పరిధిలో ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేశారు. దీంతో వారి నమూనాలను జన్యు విశ్లేషణ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీ ప్రయోగశాలకు వెంటనే పంపినట్లు అధికారులు చెప్పారు.

ఇతర దేశాల నుంచి 77 మంది రాక : ఇతర దేశాల నుంచి గురువారం జిల్లాకు 77 మంది వచ్చారు. వారందరినీ గుర్తించి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటి వరకు 5,851 మందికి పరీక్షలు నిర్వహించగా 27 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు. వారికి సన్నిహితంగా మెలిగిన వారిలో ఏడుగురికి కరోనా వైరస్‌ నిర్ధారణ జరిగింది. ఇప్పటి వరకు 12 మందికి కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని