logo

జిల్లాలో 54,816 టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లాలోని 492 రైతు భరోసా కేంద్రాల ద్వారా 2,336 మంది రైతుల నుంచి 54,816 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు ఎం.విజయభారతి పేర్కొన్నారు. సత్తెనపల్లిలో

Published : 21 Jan 2022 04:19 IST

గ్రామీణ సత్తెనపల్లి, న్యూస్‌టుడే : జిల్లాలోని 492 రైతు భరోసా కేంద్రాల ద్వారా 2,336 మంది రైతుల నుంచి 54,816 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు ఎం.విజయభారతి పేర్కొన్నారు. సత్తెనపల్లిలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ మార్కెటింట్‌ శాఖ, డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ సాయంతో కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. కొనుగోలు జరిగిన 21 రోజులకు రైతు ఖాతాలో సంబంధిత నగదు జమవుతుందన్నారు. ఈ-క్రాప్‌లో పేరు నమోదు కాని రైతుల ధాన్యం కొనుగోలు చేయడం కుదరదన్నారు. అయితే ఇప్పటికీ ఈకేవైసీ చేయని రైతులకు ప్రస్తుతం అవకాశం ఉందన్నారు. 839 కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలకు రూ.120 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ లక్ష్యంగా నిర్ణయించినట్లు జేడీఏ తెలిపారు. ఇప్పటివరకు 288 బృందాలకు 3.58 కోట్ల రాయితీతో స్ప్రేయర్లు, రొటావేటర్లు, ఇతర వ్యవసాయ పరికరాలు అందజేశామన్నారు. ఇటీవల ఎడతెరిపి లేని వర్షాలకు బాపట్ల ప్రాంతంలో 1,900 ఎకరాల్లో కోసి ఆరబెట్టిన వరి పనలు తడిచాయని, నష్టం వాటిల్లలేదన్నారు. ఏడీఏలు సీహెచ్‌.రవికుమార్‌, కె.అమలకుమారి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని