logo

కొనసాగుతున్న మిర్చి క్రయవిక్రయాల జోరు

గుంటూరు మిర్చియార్డులో క్రయవిక్రయాల జోరు కొనసాగుతోంది. యార్డుకు రైతులు గురువారం మొత్తం 67,586 బస్తాలు తరలించారు. గత నిల్వలతో కలిపి ఈ-నామ్‌ ద్వారా 68,351 బస్తాలు విక్రయాలు జరిగాయి. యార్డుకు వచ్చిన బస్తాల కంటే అదనంగా 765 బస్తాలు అమ్మకాలు జరిగాయి.

Published : 21 Jan 2022 04:33 IST

మిర్చియార్డు, న్యూస్‌టుడే: గుంటూరు మిర్చియార్డులో క్రయవిక్రయాల జోరు కొనసాగుతోంది. యార్డుకు రైతులు గురువారం మొత్తం 67,586 బస్తాలు తరలించారు. గత నిల్వలతో కలిపి ఈ-నామ్‌ ద్వారా 68,351 బస్తాలు విక్రయాలు జరిగాయి. యార్డుకు వచ్చిన బస్తాల కంటే అదనంగా 765 బస్తాలు అమ్మకాలు జరిగాయి. లావాదేవీలు ముగిసే సమయానికి యార్డులో 26,232 బస్తాలు నిల్వ ఉన్నాయి. కామన్‌ వెరైటీ మిర్చి రకాల ధరలు రూ.500 వరకు పెరిగాయి. నాన్‌ ఏసీ 334 రకం మిర్చి ధర రూ.7,000 నుంచి రూ.16,800, నెంబర్‌ 5 రూ.11,000 నుంచి రూ.15,500, 273 రకం రూ.7,500 నుంచి రూ.16,500, 341 రకం రూ.7,000 నుంచి రూ.17,500, సూపర్‌ 10 రూ.11,500 నుంచి రూ.16,300 ఉంది. స్పెషల్‌ వెరైటీ తేజ రకం మిర్చికి రూ.7,000 నుంచి రూ.17,000, బాడిగ రూ.7,000 నుంచి రూ.17,500, తాలు మిర్చికి రూ.4,000 నుంచి రూ.9,500 ధర లభించింది. ఏసీ కామన్‌ వెరైటీ 334 రూ.7,200 నుంచి రూ.16,000, 341 రూ.13,500 నుంచి రూ.16,800, స్పెషల్‌ వెరైటీ తేజ రకం మిర్చికి రూ.7,500 నుంచి రూ.16,000, బాడిగ రూ.11,500 నుంచి రూ.17,000, తాలు మిర్చికి రూ.5,200 నుంచి రూ.8,300 ధర లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని