logo

లబ్ధిదారులూ ఇళ్ల నిర్మాణం చేపట్టండి: కలెక్టర్‌

జిల్లాలో వేసిన ప్రభుత్వ లేఔట్లలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ కోరారు. ఆయన గురువారం పెదరావూరులోని ప్రభుత్వ లేఔట్‌లో ఏర్పాటుచేసిన ‘బేస్‌మెంట్‌ మేళా’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపు లబ్ధిదారులకు

Published : 21 Jan 2022 04:33 IST

పెదరావూరు లేఔట్‌లో అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌. పక్కన ఎమ్మెల్యే శివకుమార్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ నసీమ్‌, కమిషనర్‌ జస్వంతరావు తదితరులు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: జిల్లాలో వేసిన ప్రభుత్వ లేఔట్లలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ కోరారు. ఆయన గురువారం పెదరావూరులోని ప్రభుత్వ లేఔట్‌లో ఏర్పాటుచేసిన ‘బేస్‌మెంట్‌ మేళా’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపు లబ్ధిదారులకు డ్వాక్రా రుణాలు ఇచ్చేందుకు, ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనుల బిల్లుల చెల్లింపునకు గృహ నిర్మాణ, మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి లేఔట్లలో ఇంకా తోలాల్సిన మెరక, రోడ్ల నిర్మాణ తీరును ప్రత్యక్షంగా పరిశీలించినట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తాను లేఔట్లలో గమనించిన సమస్యలకు పరిష్కారం లభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, సబ్‌కలెక్టర్‌ నిధి మీనా, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సయ్యద్‌ ఖాలెదా నసీమ్‌, గృహనిర్మాణ సంస్థ ఇన్‌ఛార్జి పీడీ బసవయ్య, తహసీల్దార్‌ కె.రవిబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.జస్వంతరావు, డీఈ రఫీ, ఏఈలు శ్రీనివాస్‌, పిచ్చయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని