logo

పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు

రాష్ట్రంలో 281 చారిత్రక కట్టడాల్లో 180 దేవాలయాలున్నాయని.. వాటి పరిరక్షణకు రూ.38 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పురావస్తు శాఖ డీడీ పి.సురేష్‌ తెలిపారు. వినుకొండలో ఆ శాఖ అధీనంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం పక్కన ఇటీవల

Published : 21 Jan 2022 04:47 IST

లక్ష్మీనరసింహస్వామి ఆలయం పక్కనున్న వస్తువులను పరిశీలిస్తున్న డీడీ సురేష్‌, సిబ్బంది

వినుకొండ, న్యూస్‌టుడే : రాష్ట్రంలో 281 చారిత్రక కట్టడాల్లో 180 దేవాలయాలున్నాయని.. వాటి పరిరక్షణకు రూ.38 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పురావస్తు శాఖ డీడీ పి.సురేష్‌ తెలిపారు. వినుకొండలో ఆ శాఖ అధీనంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం పక్కన ఇటీవల తవ్వకాల్లో మట్టిపాత్రలు బయటపడిన ప్రాంతాన్ని ఆ శాఖ కార్యదర్శి వాణీమోహన్‌ ఆదేశాల మేరకు సిబ్బందితో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 37 ప్రాచీన కట్టడాలున్నాయని, వీటిని జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉందని.. అవసరమైన చోట ఔత్సాహికుల సాయం తీసుకుంటామని చెప్పారు. వినుకొండ కొండ దిగువున గుడి పక్కన ఖాళీ స్థలంలో ఈనెల 18న ప్రైవేటు వ్యక్తులు చేసిన తవ్వకాల్లో బయటపడిన మట్టి పాత్ర మధ్యయుగం కాలం నాటిదని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన వస్తువులను సీఐ రమేష్‌బాబు ఆయనకు అప్పగించారు. వాటిని పరిశీలించిన డీడీ మట్టి కుండలో ఉన్న మెటీరియల్‌ పరిశీలిస్తే సీసం, కాఫర్‌ కలిసినట్లు ఉందని, వాడిన తర్వాత మిగిలిన భాగం కుండలో నిల్వ పెట్టినట్లు ఉందని.. అయినా పరీక్షలకు వాటిని మైనింగ్‌ శాఖకు పంపిస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని గతంలో ప్రజలు నివాసంగా వినియోగించారనడానికి ఆధారాలు ఉన్నట్లు చెప్పారు. ఆయన వెంట సాంకేతిక సహాయకుడు బి.దీపక్‌జో తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని