logo

కనీస పరిజ్ఞానం లేకుండా రైతుకు సేవలెలా?

ధాన్యం సేకరణ, తేమ శాతం పరీక్షలు, వివరాల నమోదుపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రైతులకు సేవలెలా అందిస్తారని రైతుభరోసా కేంద్రం సిబ్బందిపై రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు

Published : 21 Jan 2022 04:50 IST

రాంభొట్లపాలెం(చెరుకుపల్లి గ్రామీణ), కర్లపాలెం, న్యూస్‌టుడే : ధాన్యం సేకరణ, తేమ శాతం పరీక్షలు, వివరాల నమోదుపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రైతులకు సేవలెలా అందిస్తారని రైతుభరోసా కేంద్రం సిబ్బందిపై రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం చెరుకుపల్లి మండలం రాంభొట్లపాలెంలోని ఆర్బీకే, కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపంలోని ఎఫ్‌సీఐ గోదామును ఆయన తనిఖీ చేశారు. రైతులకు అందించే సేవలపై రాంభొట్లపాలెంలో సిబ్బందిని ప్రశ్నించగా, సరైన సమాధానం రాలేదు. తాను మరోసారి వచ్చే సరికి మార్పు కనిపించాలని వీరపాండ్యన్‌ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని