logo

అసమానతల నిర్మూలన బాధ్యత యువతదే

సమాజంలో అసమానతల నిర్మూలన బాధ్యతను యువత స్వీకరించాలని స్టెప్‌ సీఈవో డాక్టర్‌ వి.శ్రీనివాసరావు అన్నారు. నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో జల్లా స్థాయి యువ సమ్మేళనం

Updated : 21 Jan 2022 06:07 IST

క్రీడా సామగ్రిని అందజేస్తున్న నెహ్రూ యువజన కేంద్ర సభ్యులు

నవభారత్‌నగర్‌(గుంటూరు), న్యూస్‌టుడే: సమాజంలో అసమానతల నిర్మూలన బాధ్యతను యువత స్వీకరించాలని స్టెప్‌ సీఈవో డాక్టర్‌ వి.శ్రీనివాసరావు అన్నారు. నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో జల్లా స్థాయి యువ సమ్మేళనం హిందూ కళాశాలలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత సమాజంలోని సమస్యలను అధ్యయనం చేయడమే కాకుండా వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. యువతను చైతన్యం చేయడానికి నెహ్రూ యువజన కేంద్రం చేస్తున్న ఫిట్‌ ఇండియా, యూత్‌ వెల్‌నెస్‌ వంటి కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. జీజీహెచ్‌ అసోసియేట్‌ ఆచార్యులు డాక్టర్‌ ఎస్‌.ఎస్‌.వి.రమణ మాట్లాడుతూ యువతలో నైపుణ్యతే దేశాభివృద్ధికి మొదటి అడుగని, యువత సంఘాలుగా ఏర్పడి గ్రామాలకు కావాల్సిన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. గ్రామాల నుంచి వచ్చిన యువజన సంఘాలకు క్రీడా సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డి.ఎన్‌.దీక్షిత్‌, నెహ్రూ యువజన కేంద్రం అధికారి దేవిరెడ్డి కిరణ్మయి, గుంటూరు గ్రీన్‌కోర్‌ సమన్వయకర్త తిరుపతిరెడ్డి, తదితరులు ప్రసగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని