Ap News: ఏపీఎస్‌ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.144 కోట్లు

సంక్రాంతి పండుగకు ఏపీఎస్ఆర్టీసీకి రూ.144 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాలకు మొత్తంగా 5,422 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడిపిందన్నారు. వీటిలో ఏపీ నుంచి హైదరాబాద్‌కే 1,350 బస్సులు నడిపినట్ల...

Published : 22 Jan 2022 01:27 IST

అమరావతి: సంక్రాంతి పండుగకు ఏపీఎస్ఆర్టీసీకి రూ.144 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాలకు మొత్తంగా 5,422 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడిపిందన్నారు. వీటిలో ఏపీ నుంచి హైదరాబాద్‌కే 1,350 బస్సులు నడిపినట్లు తెలిపారు. జనవరి 17వ తేదీన ఒక్కరోజే ఆర్టీసీకి రూ. 15.40 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ఆ రోజున అత్యధిక సంఖ్యలో 36 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినట్లు చెప్పారు.  కొవిడ్ ఉద్ధృతి కారణంగా ఈ సారి చెన్నై, బెంగళూరు నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ధన్యవాదాలు తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని