logo

గుడివాడ ...రగడరగడ

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లో సంక్రాంతి సందర్భంగా కాసినో, అర్ధనగ్న నృత్య ప్రదర్శనలు జరిగినట్లు నిరూపిస్తామంటూ శుక్రవారం గుడివాడ వెళ్లిన తెదేపా నిజ నిర్ధారణ కమిటీకి అడుగడుగునా

Published : 22 Jan 2022 03:34 IST

ఉదయం11 గంటలు: మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉదయం11 గంటలు: మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి

బయలుదేరిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు బొండా ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు తదితరులు

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లో సంక్రాంతి సందర్భంగా కాసినో, అర్ధనగ్న నృత్య ప్రదర్శనలు జరిగినట్లు నిరూపిస్తామంటూ శుక్రవారం గుడివాడ వెళ్లిన తెదేపా నిజ నిర్ధారణ కమిటీకి అడుగడుగునా నిర్బంధాలు ఎదురయ్యాయి. అప్పటికే గుడివాడ చేరుకున్న వైకాపా శ్రేణులు అక్కడి తెలుగుదేశం కార్యాలయంపై రాళ్ల వర్షం కురిపించారు. కుర్చీలు, సామగ్రిని ధ్వంసం చేశారు. తెదేపా నాయకుడు బొండా ఉమా కారుపై రాళ్లు రువ్వారు. పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తెదేపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కమిటీ పర్యటన అర్ధంతరంగా ముగిసింది

-న్యూస్‌టుడే- గుడివాడ, పామర్రు, పామర్రు గ్రామీణం

దావులూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు.  తర్వాత పామర్రు క్రాస్‌ రోడ్డు, గుడివాడ ప్రవేశ ప్రాంతం వద్ద కూడా పోలీసులు తెదేపా వాహనాలకు అడ్డుపడ్డారు.

బెదిరింపులు  

గాయపడ్డ తెదేపా కార్యకర్త రమేశ్‌ చౌదరి రాత్రి స్థానిక ఏరియా ఆస్పత్రిలోని ఔట్‌పోస్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. విషయం తెలిసిన పెద్దికిషోర్‌, మరికొందరు ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకుని రమేష్‌చౌదరిని బెదిరించారు. తమపై ఫిర్యాదు చేస్తే అంతుచూస్తామని హెచ్చరించారు.

కె. కన్వెన్షన్‌కు వస్తున్న తెదేపా నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

తెదేపా కార్యాలయం వద్ద కుర్చీ విసురుతున్న వైకాపా కార్యకర్త

బొండా ఉమా కారుపై రాయి విసురుతూ..

రమేశ్‌ చౌదరిపై దాడికి తెగబడ్డాడంటూ తెదేపా విడుదల చేసిన పెద్ది కిశోర్‌ చిత్రం


వైకాపా శ్రేణుల నిరసన

తెదేపా నాయకుల పర్యటనకు వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు రహదారిపైకి వచ్చి ఆందోళన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని