logo

ఖాళీలు 67... దరఖాస్తులు 2,916

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఒంగోలు, ఆర్కేవ్యాలీ, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో రిజర్వేషన్ల వారీగా 67 ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీకి

Published : 22 Jan 2022 03:34 IST

నూజివీడు, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఒంగోలు, ఆర్కేవ్యాలీ, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో రిజర్వేషన్ల వారీగా 67 ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీకి ఈ నెల 20తో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. మొత్తం 2,916 దరఖాస్తులు అందాయని ఆర్జీయూకేటీ ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు శుక్రవారం తెలిపారు. వీటిలో 2,812 మంది సీటు దక్కని కొత్త అభ్యర్థులు ఉండగా, క్యాంపస్‌ల మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్న వారు 104 మంది అభ్యర్థులు ఉన్నారు. క్యాంపస్‌ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆర్జీయూకేటీ నూజివీడు నుంచి ముగ్గురు, ఒంగోలు నుంచి 53 మంది, ఆర్కేవ్యాలీ నుంచి ఒకరు, ఆర్జీయూకేటీ శ్రీకాకుళం నుంచి 47 మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. ఇప్పటికే సీట్లు పొంది క్యాంపస్‌ మార్పిడికి దరఖాస్తు చేసుకున్న 104 మంది అభ్యర్థులు ఆర్జీయూకేటీ సెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న 67 సీట్లను కొత్త అభ్యర్థులకే కేటాయిస్తామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని