logo

ఘరానా దొంగల అరెస్ట్చు

భవానీపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గత నెలలో జరిగిన మూడు చోరీ కేసులు కొలిక్కి వచ్చాయి. కాకినాడకు చెందిన రమేష్‌ అనే వ్యక్తి ఈ చోరీలకు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. నిందితుడు ముందుగా రెక్కీ

Published : 22 Jan 2022 03:34 IST

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: భవానీపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గత నెలలో జరిగిన మూడు చోరీ కేసులు కొలిక్కి వచ్చాయి. కాకినాడకు చెందిన రమేష్‌ అనే వ్యక్తి ఈ చోరీలకు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. నిందితుడు ముందుగా రెక్కీ చేసి తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తాడు. ఇతర రాష్ట్రాల నేరస్థులతో దొంగతనాలు చేయిస్తాడు. ఆయా ఘటనల్లో రమేష్‌తో పాటు ఇండోర్‌కు చెందిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు

భవానీపురంలో భారీ చోరీ

భవానీపురం పీఎస్‌ పరిధిలో గత నెలలో జరిగిన చోరీల్లో భారీ సొత్తు చోరీకి గురైంది. ఈ ముఠా తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి వాటిని ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతుంది. గత నెల 26, 28 తేదీల్లో మొత్తం 3 చోరీలు జరగ్గా వాటిలో సుమారు 500 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి సామగ్రి, రూ.2.35 లక్షల నగదు చోరీకి గురైంది. నీ భవానీపురం హెచ్‌బీ కాలనీలో 28న జరిగిన చోరీలో పోలీసులు కీలకమైన ఆధారాలు గుర్తించారు. పాత నేరస్థుడికి చెందిన వేలిముద్రలు దొరకడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కాకినాడకు చెందిన రమేష్‌ను ఈ చోరీలకు ప్రధాన సూత్రధారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇండోర్‌కు చెందిన ఒక నేరస్థుడిని పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇతని కోసం ఇండోర్‌కు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించారు.

13 కేసుల్లో రికవరీ!

కాకినాడకు చెందిన రమేష్‌ చోరీ సొత్తును కూడా కొంటాడని పోలీసుల విచారణలో తేలింది. కాకినాడలో దాదాపు 10, భవానీపురం పీˆఎస్‌ పరిధిలో 3 చోరీలు చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ 13 కేసుల్లో భారీగానే సొమ్మును విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని