logo

బంగారు ఆభరణాల చోరీపై ఫిర్యాదు

భర్త ఇంట్లో భార్య, ఆమె బంధువులు బంగారు ఆభరణాలు చోరీ చేశారంటూ అందిన ఫిర్యాదుపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కానూరుకు చెందిన తంబళ్లపల్లి ధీరేంద్రకు 2018లో

Published : 22 Jan 2022 03:34 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: భర్త ఇంట్లో భార్య, ఆమె బంధువులు బంగారు ఆభరణాలు చోరీ చేశారంటూ అందిన ఫిర్యాదుపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కానూరుకు చెందిన తంబళ్లపల్లి ధీరేంద్రకు 2018లో హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన పాకనాటి నిహారికతో వివాహమైంది. వారు హైదరాబాద్‌లోనే నివాసముంటున్నారు. గతేడాది ఆగస్టులో నిహారిక భర్తతో కలిసి కానూరులోని అత్తగారింటికి వచ్చారు. రెండ్రోజుల అనంతరం అత్త బంధువుల ఇంటికి వెళ్తూ లాకరు తాళాలు నిహారికకు ఇచ్చారు. వారం రోజుల అనంతరం ధీరేంద్ర, నిహారికిలు తిరిగి హైదారాబాద్‌ వెళ్లిపోయారు. కొద్దికాలం తర్వాత నుంచి భార్యభర్తలిద్దరి నడుమ విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో ధీరేంద్ర ఈ నెల 17న కానూరు వచ్చారు. అమ్మవారికి పూజ చేయడానికి లాకరులో ఉన్న బంగారు ఆభరణాలను తీయడానికి తాళాలు కోసం వెతకగా కనిపించలేదు. తర్వాత మారు తాళాలతో లాకరును తెరవగా అందులో ఉండాల్సిన రూ. 30 లక్షల విలువైన బంగారు, వజ్రాల గాజులు, కాసుల పేరు తదితర ఆభరణాలు కనిపించలేదు. దీంతో వాటిని తన భార్య చోరీ చేసిందనే అనుమానంతో ఆమెతో పాటు, అత్తింటి వారిపై పెనమలూరు పోలీసులను ధీరేంద్ర ఫిర్యాదు చేశారు. అతని భార్య నిహారిక, మామ కమలేష్‌, అత్త కుసుమలత, మరదలు కాత్యాయని, తోడల్లుడు, చిత్తూరు జిల్లా సత్యవేడు మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్యలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని